బాహుబలి అనంతరం ప్రభాస్ నటించిన సాహో “బాహుబలి” స్థాయిలోనే అన్నీ భాషల్లో విడుదలై మిశ్రమ స్పందన దక్కించుకొన్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు ప్రారంభ వసూళ్లు భారీ స్థాయిలో వచ్చినప్పటికీ.. ఫైనల్ కలెక్షన్స్ మాత్రం ఊహించిన స్థాయిలో రాలేదు. దాంతో తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ భారీ స్థాయిలో నష్టపోయే అవకాశాలున్నాయని అప్పట్లో విశ్లేషణలు వెలువడ్డాయి. ఇప్పుడు క్లోజింగ్ కలెక్షన్స్ కూడా వచ్చేశాయి కానీ.. సినిమా కారణంగా నష్టపోయింది ఎవరు అనేది ఇంకా మాత్రం ఇంకా తెలియడం లేదు.
చాలా ఏరియాల్లో యువీ క్రియేషన్స్ ఓన్ రిలీజ్ చేసుకొన్నారు అనే టాక్ వినబడుతున్నప్పటికీ.. డిస్ట్రిబ్యూటర్స్ కి దాదాపు 40 కోట్ల నష్టం వాటిల్లిందని కూడా సమాచారం. మరి ఆ నష్టాలను యువీ సంస్థ ఎలా తీరుస్తుంది అనేది తెలియాల్సి ఉండగా.. ప్రస్తుతానికి “సాహో” వల్ల ఎవరూ నష్టపోలేదు అని తెగ కవర్ చేస్తున్నారు. సినిమాకి కలెక్షన్స్ రాకుండా, భారీ రేట్లకు అమ్ముడుపోయిన సినిమాకి నష్టాలు రాకుండా ఎలా ఉంటాయి అనేది ఎవరికీ అర్ధం కాని ప్రశ్న.
ఎవ్వరికీ చెప్పొద్దు సినిమా రివ్యూ & రేటింగ్!
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!