Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

‘టాక్సిక్‌’ సినిమా గురించి చాలా రోజులుగా మాట్లాడుకుంటున్నారు. ఎవరూ ఊహించని విధంగా సినిమా ఉంటుందని, రాకింగ్‌ స్టార్‌ ఇమేజ్‌కి తగ్గ కథ ఉంటుంది. యాక్షన్‌, మాస్‌ అంశాలను బాగా దట్టించి సినిమా సిద్ధం చేస్తున్నారు అని అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే సినిమా టీజర్‌లోనూ ఆ ఎలిమెంట్స్‌ బాగా కనిపించాయి. యశ్‌ గత సినిమాలు ‘కేజీయఫ్‌’ను మించి ఇందులో యాక్షన్‌ చూశారు అభిమానులు. వాటితోపాటు ఓ అదనపు ఎలిమెంట్‌ కూడా కనిపించింది.

Toxic

సినిమా టీజర్‌ చూసిన వారికి అదేంటో ఈజీగా అర్థమైపోతుంది. ఆ అదనపు స్పెషల్‌ ఎలిమెంట్‌ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సినిమాలో యశ్‌తో ఓ ఇంటిమేట్ సీన్‌లో నటించిన అమ్మాయి గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ వీడియోలో సూపర్‌ ఎగ్జైటింగ్‌గా కనిపించిన అందం పేరు నటాలీ బర్న్. ఉక్రెయిన్‌ – అమెరికన్ కాంబినేషన్‌ మోడల్. అలాగే నటి కూడా.

‘ది ఎక్స్ పాండబుల్స్ 3’, ‘డాన్‌ హిల్‌’ తదితర హాలీవుడ్ సినిమాల్లో నటించి తన అందచందాలతో మెప్పించింది. ఈ సినిమాలో ఆమె నటించింది అని టీజర్‌ చూశాక మనకు తెలిసింది. అయితే కొన్ని రోజుల క్రితమే ‘టాక్సిక్’ సినిమాలో నటిస్తున్నట్లు నటాలీ బర్న్‌ సోషల్ మీడియాలో చెప్పేసింది. ఇప్పుడు ఆమె సోషల్‌ మీడియా ఖాతా చూస్తే ఈ విషయం తెలుస్తోంది.

ఇక ఈ సినిమా టీజర్‌ చూశాక దర్శకురాలు గీతూ జోసెఫ్‌ మీద పెద్ద ఎత్తున ప్రశంసలూ వస్తున్నాయి. విమర్శలూ వస్తున్నాయి. ఓ మహిళా దర్శకురాలు ఇలాంటి సీన్‌ రాయడమా, అదే పురుష దర్శకుడు ఇలాంటి సీన్‌ రాస్తే మీరు ఊరుకుంటారా అని అంటున్నారు. ఇక ఇలాంటి సినిమాలు, సీన్లు తీయడంలో సిద్ధహస్తులు అయితే మాజీ, నేటి తరం దర్శకులు అయితే ఆమెను బాగా మెచ్చుకుంటున్నారు.

మగాళ్లు.. కుక్కలు.. నోరు పారేసుకున్న టాలీవుడ్‌ నటి.. ఇది కరెక్టేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus