పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ వీరిద్దరి బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట సహజీవనం చేసి.. పిల్లల్ని కని ఆ తరువాత పెళ్ళిచేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన 2012 వీరిద్దరూ విడిపోయారు. అటు తరువాత రష్యన్ యువతి అన్నా లెజినోవాను పవన్ పెళ్ళి చేసుకోగా.. రేణు దేశాయ్ కొన్నాళ్ళు పూణే లో ఉంటూ వచ్చింది. అయితే ఎంత విడిపోయినప్పటికీ వీళ్ళిద్దరూ పిల్లల విషయంలో భాద్యతగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. కొడుకు అకీరా, ఆద్య పుట్టిన రోజులకి కలుస్తూనే ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికీ రేణుదేశాయ్ కెరీర్ పట్ల జాగ్రత్తలు తీసుకుంటూనే వస్తున్నారని తాజా సమాచారం.
నిర్మాతగా మారి రేణు రూపొందించిన ‘ఇష్క్ వాలా లవ్’ సినిమాకి పవన్ చాలా సాయం చేశారట. ఇక ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో తిరిగి హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఉంటూ వస్తుంది. ‘ఢీ’ షో కి రేణు జడ్జిగా వ్యవహరించడం వెనుక కూడా పవన్ రెకమెండేషన్ ఉందట. అంతేకాదు ‘బిగ్ బాస్’ షో కి రావాలని రేణుకి ఫోన్ వచ్చినప్పుడు… పవన్ కు చెప్పగా.. ఆయన వద్దన్నాడని తెలుస్తుంది. ‘ఆ షోకి వెళ్తే రాజకీయంగా తన పై విమర్శలు వస్తాయని..అలాగే నీ వ్యక్తి గత జీవితం పై కూడా విమర్శలు వస్తాయని’ పవన్ చెప్పడంతో రేణు వద్దని చెప్పిందట. ఇక ఆర్ధిక అవస్రతల విషయంలో కూడా పవన్ అన్నయ్య నాగబాబు… రేణుదేశాయ్ కు సహాయం చేస్తూ ఉంటారట. ఇక రెండో పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నట్టు కూడా రేణు.. పవన్ కు చెప్పినప్పుడు కూడా సానుకూలంగా స్పందించి.. అందుకు తన వంతు సాయం కూడా చేస్తున్నారని తెలుస్తుంది. ఇలా ప్రతీ విషయంలోనూ రేణుకి అండగా నిలబడుతున్నాడట పవన్ కళ్యాణ్.
‘సైరా’ సినిమా రివ్యూ & రేటింగ్!
వార్ సినిమా రివ్యూ & రేటింగ్!