టాలీవుడ్ టాప్ కమీడీయన్, పద్మశ్రీ బ్రహ్మానందం అంటే బహుశా తెలియని వారు ఉండరేమో. పెద్దల నుంచి చిన్న వాళ్ల వరకు బ్రహ్మీ కామెడీ అంటే ఇష్టం లేను వారు ఉండరు. అయితే ఒకప్పుడు వరుస సినిమాలతో, ఇండస్ట్రీ ని శాసించిన బ్రహ్మీకి ఇప్పుడు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. అదే క్రమంలో అప్పట్లో బ్రహ్మీ లేని సినిమా ఉండేది కాదు, అంతేకాకుండా దర్శకులు సైతం హీరో క్యారెక్టర్ పై కాకుండా బ్రహ్మీ క్యారెక్టర్ పైనే ఎక్కువ దృష్టి పెట్టి మరీ ఆ పాత్రను డిసైన్ చేసేవారు. అంతటి మన్నలను పొందిన మన బ్రహ్మీ ఇప్పుడు ఫార్మ్ కోల్పోవడానికి అనేక కారణాలు ఉన్నాయనే చెప్పాలి.
అందులో కొన్ని ఆయన చేసుకున్న తప్పులు అవగా…మరికొన్ని ఇతరుల వల్ల ఏర్పడినవే. అయితే బ్రహ్మానందంకి అవకాశాలు తగ్గిపోవటంతో ఇండస్ట్రీలోని ఇతర కమెడియన్స్ కి ఒక్కసారిగా అవకాశాలు పెరిగిపోయాయి. ఆ అవకాశాలు పెరిగిపోయిన జాబితాలో మన 30యియర్స్ పృధ్వి ఒకరు. ఈ మధ్య కాలంలో పృథ్వీ చేస్తున్న కామెడీ సీన్స్ కి ప్రేక్షక ఆధరణ ఎక్కువుగా ఉండటంతో…అందరూ పృథ్వీ కోసం కొన్ని ప్రత్యేకమైన ట్రాక్స్ ని రాస్తున్నారు. హీరోలు, దర్శకులు, రచయితలు అందరూ పృథ్వీ ని సినిమాలోకి తీసుకుంటే సినిమాకి ప్రత్యేకమైన హంగు ఏర్పడుతుందని అంటున్నారు.
అంతేకాకుండా రెమ్యునిరేషన్ పరంగా సైతం పృధ్వి కాస్త తక్కువ పలుకుతూ ఉండడంతో దర్శక నిర్మాతలు సైతం ఆయన్నే కావాలని మరీ సినిమాలో పెట్టుకుంటున్నారు. ఇంకా చెప్పాలి అంటే పృధ్వి కోసం అనేక పాత్రలను సైతం ప్రత్యేకంగా డిసైన్ చేస్తూ ఉండడం విశేషం. ఏది ఏమైనా…బ్రహ్మీ పని అయిపోయినట్లే అన్న టాక్స్ అయితే టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.