తమ్ముడి పరాభవాన్ని అన్నయ్య ముందే గ్రహించారా

  • May 27, 2019 / 06:32 PM IST

ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ దారుణమైన పరాజయం ఒకవైపు ఆయన అభిమానుల్ని, జనసైనికుల్ని మరియు తెలుగు రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ పరాభవం నుంచి పవన్ కళ్యాణ్ అయినా తొందరగా బయటపడగలిగాడు ఆయన ఫాలోవర్స్ మాత్రం ఇంకా ఆ ఓటమి అంచుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే.. పవన్ కళ్యాణ్ ఓడిపోవడం, ఆయన పార్టీ 60 స్థానాల్లో పోటీ చేయగా కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలవడం వంటివి పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ముందుగానే ఊహించారా అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

పవన్ కళ్యాణ్ సొంత పార్టీ పెట్టడం ఇష్టం లేకపోయినప్పటికీ.. అతడి అభీష్టాన్ని వ్యతిరేకించడం ఇష్టం లేక మిన్నకుండిపోయాడు మెగాస్టార్.

కానీ.. పవన్ కళ్యాణ్ పరాభవం అనంతరం మెగాస్టార్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో.. పవన్ పరాజయాన్ని చిరంజీవి ముందుగానే ఊహించారా? లేదా సర్వేల ఆధారంగా తెలుసుకొని పవన్ కళ్యాణ్ ను ముందుగానే హెచ్చరించారా? వంటి ప్రశ్నలు అందరికీ కలుగుతున్నాయి. లేక ఎందుకొచ్చిన గోల అని సైలెంట్ అయిపోయారా అని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus