Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

తమిళనాడులో హీరోలు రాజకీయ పార్టీలు పెట్టడం.. ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో పోటీ చేయడం.. ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోవడం.. కొన్నాళ్లకు మరో పార్టీకి ఉప పార్టీగా మారే పరిస్థితి రావడం, లేదంటే ఏదో పార్టీ ఉంది అంటే ఉందీ అనిపించేలా ఉండటం తప్పితే.. పెద్దగా ప్రభావం చూపించిన హీరోల పార్టీలు లేవు. అయితే వీటన్నింటికి విజయ్‌ పార్టీ టీవీకే చాలా డిఫరెంట్‌. ఆయన పార్టీ ఎన్నికల్లో గెలిచి.. చరిత్ర సృష్టించింది.

Dhanush

మరి ఆయన ఇచ్చిన స్ఫూర్తా లేక ఎప్పటి నుండో అనుకుంటున్నాడో తెలియదు కానీ ప్రముఖ కథానాయకుడు ధనుష్‌ కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఈ మేరకు ఢిల్లీలో మకాం వేసి మరీ చర్చలు జరుపుతున్నట్లు తమిళనాడు వర్గాలు చెబుతున్నాయి.రాజకీయ పార్టీ ప్రారంభంపై ఆయన కీలక వ్యక్తులను కలసి సమాలోచనలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ‘తమిళగ ఎళుచ్చి కళగం’ అనే పార్టీ పేరును నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రెండు రోజులుగా ధనుష్‌ ఢిల్లీలో ఉండటం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. త్వరలో జరగనున్న ధనుష్‌ నర్పణి ఇయక్కం నిర్వాహకుల సమావేశంలో ధనుష్‌ రాజకీయ అరంగేట్రం గురించి కీలక ప్రకటన చేస్తాడు అని అంటున్నారు. గతంలో చూస్తే.. విజయ్‌ కూడా ఇలానే అభిమానులు, నిర్వాహకుల సమావేశాలతో తన రాజకీయ ఆలోచనలను ప్రజల్లోకి పంపించారు.

అయితే, పార్టీ పెట్టడానికి ఢిల్లీలో ఉంటూ సమాలోచనలు చేయాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే, ఓ జాతీయ పార్టీ ఆలోచనలకు అనుగుణంగా ధనుష్ అడుగులు పడుతున్నాయి అని అంటున్నారు. ఇప్పటికిప్పుడు తమిళనాడులో విజయ్‌ పార్టీకి సరైన పోటీ ఇచ్చే పార్టీ తమిళనాడులో ఆ పార్టీకి కనిపించడంల లేదని.. అందుకే మరో హీరోతోనే పోటీకి సిద్ధమవ్వాలని ఆ పార్టీ చూస్తోందని సమాచారం.

అయితే, తమిళనాట రజనీకాంత్, కమల్‌హాసన్‌ లాంటి వాళ్లు పార్టీలు అని ప్రకటించారు. రజనీ మధ్యలోనే తప్పుకోగా, కమల్‌ పార్టీ ఉన్నా లేనట్లుగా ఉంది. ఇక అజిత్‌ గురించి ఇలాంటి పుకార్లు వచ్చినా ఆయన నుండి నో రెస్పాన్స్‌. అన్నట్లు శివ కార్తికేయన్‌ కూడా పొలిటికల్‌ థాట్స్‌లోనే ఉన్నారని రీసెంట్‌ పరిణామాల నేపథ్యంలో అర్థమవుతోంది.

 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus