ఛార్మి పోర్చుగల్ కి అందుకే వెళ్ళిందంట!

  • May 20, 2017 / 11:43 AM IST

జ్యోతి లక్ష్మి సినిమా తర్వాత అవకాశాలు లేక పంజాబీ భామ ఛార్మి సినిమాలకు దూరంగా ఉంటోంది. ఆమె చేతిలో ప్రస్తుతం ఏ సినిమా లేదు. అయితే మొన్న సినిమా పని మీద పొర్చుగల్లో ఉన్నానని ట్విట్టర్లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ఇక ఆమె అభిమానులు ఏ చిత్రంలో నటిస్తుందోనని ఆరా తీయడం మొదలెట్టారు, తీరా తెలిసిన నిజం ఏమిటంటే… ఛార్మి ఏ సినిమాలో నటించడం లేదు. అయితే సినిమా పనిలోనే ఉంది. ఎలా అంటారా.. ? చెప్తాను. ఛార్మి అవకాశాలు తగ్గగానే పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనక్ట్స్ అనే కంపెనీ మొదలెట్టింది. సినిమాలకు అవసరమైన బ్యూటీస్ ని పరిచయం చేసే కంపెనీ అది.

ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బాలకృష్ణ 101 వ సినిమాకి కూడా పూరి కనక్ట్స్ కంపెనీ నుంచి కొంతమంది భామలను పరిచయం చేసింది. ఆ చిత్ర షూటింగ్ పొర్చుగల్లో జరుగుతుంటే భామలతో పాటు పంజాబీ భామ కూడా వెళ్ళింది. వారు షూటింగ్ లో బిజీగా ఉంటే ఛార్మి మాత్రం అక్కడి లోషన్స్ ని ఎంజాయ్ చేస్తోంది. అదండీ ఛార్మి, పోర్చుగల్ సంగతి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus