మహేష్ బాబు మౌనం వెనుక అసలు కారణం ఏంటి?

  • November 17, 2018 / 11:28 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనకి ఏదైనా సినిమా నచ్చితే దానిపైన స్పదింస్తు సోషల్ మీడియా లో వెంటనే పోస్ట్ పెడుతుంటాడు. అయితే మొన్నామధ్య మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన ‘నవాబ్’ సినిమా గురించి ఈ మధ్య రిలీజ్ అయినా ‘సర్కార్’, సినిమాలు బాగున్నాయంటూ టీం ని విష్ చేస్తూ ట్వీట్స్ పెట్టాడు. అంతేకాకుండా శంకర్ తీస్తున్న ‘2.ఓ’ పైన మహేష్ స్పదించాడు. అయితే తమిళ్ సినిమాల పైన ట్వీట్ చేసిన మహేష్ ‘ఆర్.ఆర్.ఆర్.’ సినిమాపైనే ఒక ట్వీట్ కూడా ఎందుకు చేయలేదంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇక విషయంలోకి వెళితే, ‘భరత్ అనే నేను’ అనే సినిమా అప్పుడు ఆ మూవీ ఫంక్షన్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చి మహేష్ పైన అభిమానం చాటుకున్నాడని, తెర వెనుక మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లకి మంచి అనుబంధం ఉందని, అయినప్పటికీ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్’, ‘రామ్ చరణ్’ నటిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ భారీ బడ్జెట్ సినిమా ప్రారంభం కాగా అసలు అంతటి క్రేజీ ప్రాజెక్ట్ పైన ఒక్క ట్వీట్ కూడా ఎందుకు పెట్టలేదంటూ కొందరు ఫీల్ అవుతుండగా, మహేష్ మౌనంగా ఉంది ఆ సినిమా టీజర్ ఓ ఫస్ట్ లుక్ ఓ ట్రైలర్ ఏదైనా వచ్చినప్పుడు తప్పకుండ స్పందిస్తాడని మహేష్ కి ఒకరు అంటే ఎక్కువ ఒకరు అంటే తక్కువ అనే ఫిలింగ్స్ ఉండవు అని కొందరి ఇన్నర్ ఫీలింగ్. మరి మహేష్ ఇలా వస్తున్న వాటిపైన ఏమంటాడు, అసలు స్పందిస్తాడో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus