25వ సినిమా విషయంలో మహేష్ స్పెషల్ కేర్!

  • May 23, 2018 / 01:46 PM IST

ఇప్పటివరకూ మహేష్ బాబు ఫాలో అయిన పద్ధతి ఒక లెక్క, ఇప్పుడు మహేష్ ఫాలో అవుతున్న పద్ధతి మరో లెక్క అన్నట్లుగా ఉంది ప్రెజంట్ సిచ్యుయేషన్. ఎప్పుడైతే “అతిధి” తర్వాత ఖలేజా కోసం ఏకంగా రెండేళ్లు గ్యాప్ తీసుకొన్నాడో.. అప్పట్నుంచి వీలైనంత ఫాస్ట్ గా సినిమాలు కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఏడాదికి ఒక సినిమా అందించే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం సినిమాలు చేసుకుంటూ వస్తున్న మహేష్ మళ్ళీ చాన్నాళ్ల తర్వాత నెమ్మదించాడు అనిపిస్తుంది.

“శ్రీమంతుడు” రిలీజ్ కి ముందే “బ్రహ్మోత్సవం”, “బ్రహ్మోత్సవం” పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అవ్వకముందే “స్పైడర్”, ఆ “స్పైడర్” విడుదల లేట్ అవుతుండడంతో “భరత్ అనే నేను” సినిమాల షూటింగ్ లో పాల్గొని మినిమం గ్యాప్ లేకుండా సదరు సినిమాలను ఫినిష్ చేసిన మహేష్ బాబు ఇప్పటివరకూ తన 25వ చిత్రం షూటింగ్ ప్రారంభించకపోవడం గమనార్హం.

ఇందుకు చాలా కారణాలున్నాయని తెలుస్తోంది. “భరత్ అనే నేను” విజయం తర్వాత కంటెంట్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకొంటున్న మహేష్ కథలో మార్పులు చేయమని వంశీ పైడిపల్లిని కోరాడట. సెట్స్ కు వెళ్లాల్సిన సినిమాలో మార్పులు చెప్పడంతో ఇంకాస్త టైమ్ పడుతుందని చెప్పాడట. అందుకే ఈలోగా తన ఫ్యామిలీతో జాలీగా ఫారిన్ ట్రిప్పులేస్తున్నాడు మహేష్ బాబు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus