Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

విలన్‌గా కెరీర్‌ ప్రారంభించి.. హీరోగా ఎంట్రీ ఇచ్చి ఓ దశలో మినిమమ్‌ గ్యారెంటీ హీరో అనిపించుకున్నాడు. ఒక రకం కథలకు ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌ కూడా అయిపోయాడు. కానీ ఆ తర్వాత కథల ఎంపిక విషయంలో తేడాలు కొట్టి అసలుకే మోసం వచ్చే పరిస్థితి వచ్చింది. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా గోపీచంద్‌ ఏదో ఒక సినిమా చేస్తూనే ఉన్నారు. అలా గోపీచంద్‌ను వెండితెర మీద చూసి రెండేళ్లు అయిపోయింది.

Gopichand

దీంతో అసలు గోపీచంద్ ఏం చేస్తున్నాడు. చేతిలో ఏ సినిమాలు ఉన్నాయి. అందులో విడుదలకు సిద్ధంగా ఉన్నవి ఏవి? అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో వినిపించే మొదటి పేరు ‘భరతవర్ష’. ‘ఘాజీ’ సినిమా ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఏడో శతాబ్దం నాటి బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయి పోయింది. సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ కూడా వచ్చింది. అయితే ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్స్‌ లేవు.

ఇది కాకుండా వి.వెంకట్‌ దర్శకత్వంలో ‘సింగ’ అనే మరో సినిమాను ఆ మధ్య అనౌన్స్‌ చేశారు. ఆ తర్వాత ఆ సినిమా నుండి ఎలాంటి అప్‌డేట్‌ కానీ, లీక్‌ కానీ లేదు. ఇది కాకుండా మరో సినిమా ఆ మధ్య ప్రీ ప్రొడక్షన్‌ స్టేజీలో ఉంది అని కూడా చెప్పారు. అలాగే తనకు అవసరమైనప్పుడల్లా విజయాలు అందిస్తూ వచ్చిన సంపత్‌ నంది దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతోంది అని కూడా సమాచారం వచ్చింది.

ఇలా ఇన్ని సమాచారాలు ఉన్నా.. గోపీచంద్‌ నుండి అప్‌డేట్‌ అయితే రావడం లేదు. ఆ మధ్య గోపీచంద్‌ విలన్‌గా మారతాడు అనే మాట కూడా వినిపించింది. అది ప్రభాస్‌ సినిమాతోనే అని కూడా అన్నారు. దీంతో ఈ అప్‌డేట్‌ అయినా వస్తే బాగుండు అని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు.

‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus