వాల్మీకి టీజర్ లో పూజను ఎందుకు దాచారో

  • August 16, 2019 / 05:41 PM IST

నిన్న విడుదలైన “వాల్మీకి” టీజర్ లో నెగిటివ్ షేడ్ లో కనిపించిన వరుణ్ తేజ్ ని చూసి అందరూ షాక్ అయ్యారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం “జిగర్తాండ”కు రీమేక్ అయినప్పటికీ.. హరీష్ శంకర్ మార్క్ మార్పులు భారీగా ఉన్నాయని టీజర్ తోనే తేల్చేశాడు హరీష్ శంకర్. అదే టీజర్ లో మరో ముఖ్యపాత్ర పోషిస్తున్న అధర్వ, సహాయ పాత్రలు పోషిస్తున్న రచ్చ రవి, సత్యలను కూడా చూపించారు కానీ.. కథానాయిక మరియు టీం మొత్తంలో వరుణ్ తర్వాత అంతటి రెమ్యూనరేషన్ అందుకొన్న పూజా హెగ్డేను మాత్రం చూపించలేదు.

అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం “దువ్వాడ జగన్నాధం” సినిమాలో పూజా హెగ్డేను అల్ట్రా గ్లామరస్ గా చూపించిన హరీష్ శంకర్.. “వాల్మీకి”లో మాత్రం ఆమెను దీగ్లామరస్ గా చూపించనున్నాడట. అందుకే ఆమె సెట్స్ లో జాయిన్ అయినప్పుడు పెట్టిన ఫోటోలో కానీ.. నిన్న విడుదలైన టీజర్ లో కానీ ఆమె ముఖం కనబడనివ్వలేదు. ట్రైలర్ లో అయినా చూపిస్తాడో లేదో తెలియదు. మరి అంత డీగ్లామరస్ గా చూపించడం కోసం పూజను ఎందుకు సెలక్ట్ చేసుకొన్నట్లబ్బా అని ఆలోచిస్తున్నారు జనాలు. చూడాలి హరీష్ ప్లాన్ ఏంటో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus