Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

‘ది రాజా సాబ్‌’ సినిమాకు వచ్చిన ఫలితం కంటే.. ఆ సినిమా వల్ల వచ్చిన విమర్శలకే ప్రభాస్‌, అతని ఫ్యాన్స్‌ బాగా హర్టయ్యారు. దానికి కారణం ఆ సినిమాలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, పాటల్లో ప్రభాస్‌ బదులు డూప్‌లు నటించారు అని స్పష్టంగా తెలిసిపోయింది. ‘డ్యాన్స్‌ చేస్తుంటే ఫేస్‌ కదిలింది’ అంటూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌లు కూడా చేశారు. ఆ సమయంలో ప్రభాస్‌ ఆ సినిమా సెట్స్‌కి చాలా రోజులు రాలేదని, షూటింగ్‌ మాత్రం జరిగిపోయింది అని అప్పటివరకు వచ్చిన విమర్శలకు ఆ సినిమా ఊతమిచ్చినట్లు అయింది.

Prabhas

ఇదే తరహా విమర్శలు ఈ మద్య ‘ఫౌజీ’ సినిమా విషయంలోనూ వచ్చాయి. దీనికి కౌంటర్‌ ఇవ్వాలనో లేక ఎందుకో కానీ ఇటీవల నిర్మాత మాట్లాడుతూ.. సినిమా షూటింగ్‌లో ఆ రోజు తన పాత్ర షూటింగ్‌ లేకపోయినా ప్రభాస్‌ వస్తున్నాడు అని.. సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని చెప్పారు. ఈ మాటలు విని ‘ప్రభాస్‌కి ఆ సినిమా మీద ఎంత ప్రేమనో’ అంటూ మురిసిపోతున్నారు. మరోవైపు ఇంకో ప్రశ్న బయటకు వచ్చింది. అదే దీనికి బదులు ఇంకో సినిమాకి డేట్స్‌ ఇవ్వొచ్చుగా అని.

ప్రభాస్‌ చేతిలో ప్రస్తుతం వరుస సినిమాలు ఉన్నాయి. అవే ‘కల్కి 2’, ‘సలార్‌ 2’, ‘స్పిరిట్‌’. ఇందులో ‘స్పిరిట్‌’, ‘కల్కి 2’ సినిమాలు సెట్స్‌ మీద ఉన్నాయి వాటికి గ్యాప్‌ ఇచ్చి మరీ ‘ఫౌజీ’ సినిమా పనులు చేస్తున్నాడు ప్రభాస్‌. షూటింగ్‌ లేకపోయినా ఈ సెట్స్‌కి వచ్చే బదులు ఇంకో సినిమాకి డేట్స్‌ ఇస్తే అవి తొందరగా అయిపోతాయి కదా అనేది కొంతమంది ప్రశ్న.

ఇక ‘ఫౌజీ’ సినిమా విషయానికొస్తే డిసెంబరు 3న విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. మరి అప్పటికి అవుతుందో లేక ఎప్పటిలా వాయిదా వేస్తూ కొత్త తేదీ కోసం వెతుకుతారో చూడాలి. ఎన్టీఆర్‌ ‘డ్రాగన్‌’ సినిమాకు బ్రేక్‌ వచ్చిన నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్‌ 2’ సినిమా పనులు చేస్తున్నారు అని లేటెస్ట్‌ టాక్‌.

క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus