మంచి సినిమాలు రావాలి అని ప్రేక్షకులు అంటే.. వచ్చిన మంచి సినిమాలను అలరించాలి అని సినిమా జనాలు అంటూ ఉంటారు. ఇది గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. ప్రేక్షకులు అలా అనడం, వచ్చిన మంచి సినిమాల్లో నచ్చినవి ఆదరించడం జరుగుతుంటే.. ప్రేక్షకులు అడిగిన మంచి సినిమాలు చేయలేక చతికిల పడిన సినిమా జనాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఓ మంచి సినిమాను ప్రేక్షకులు ఆదరించడం లేదు అని చెప్పే మన సినిమా పెద్దలు.. వాళ్లు ఎన్ని మంచి సినిమాలను భుజం కాస్తున్నారు అనేది ఆలోచించుకోవాలి.
ఈ మాట వినడానికి వారికి కష్టంగానే ఉండొచ్చు. కానీ ప్రపంచం మెచ్చిన సినిమాను తీసిన సినిమా వాళ్లే మెచ్చుకోకపోతే ఎలా? రీసెంట్ హిట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ‘గరివిడి లక్ష్మి’ సినిమ పేరు ప్రస్తావిస్తున్నాం. మామూలుగా అయితే గతంలోనూ ఇలా ఇండస్ట్రీ వదిలేసిన మంచి సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే, తెలుగు సినిమాకు ఎన్నో ఏళ్లుగా ఇన్‌డైరెక్ట్‌గా సాయం చేసిన ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా సినిమా వచ్చినప్పుడు మెచ్చుకోకపోతే ఎలా?
సినిమా పరిశ్రమలో ఎవరూ మెచ్చుకోలేదా అంటే చిరంజీవి, పవన్ కల్యాణ్, రవితేజ లాంటి స్టార్ హీరోలు సినిమాను మెచ్చుకున్నారు. ప్రయత్నాన్ని గొప్పగా చెప్పారు. అయితే ఇంకా చాలామంది హీరోలు ఈ సినిమా విజయానందంలో పాలుపంచుకోవడం లేదు. సినిమా బాగున్నా, బాగోలేకున్నా దానికి పాజిటివ్ రివ్యూలు ఇచ్చే హీరోలు.. ఇంత బాగున్న సినిమాకు ఇవ్వకపోతే ఎలా.
సినిమా విజయాన్ని క్లియర్‌గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ‘జైలర్ 2’, ‘రణబాలి’ కంటే డైలీ వసూళ్లలో ‘గరివిడి లక్ష్మి’ సినిమానే టాప్‌లో ఉంది. దానికి ఉత్తరాంధ్ర వసూళ్లే కీలకం. అంత మొత్తంలో సినిమాకు వసూళ్లు వస్తున్నాయి. ఆఖరిగా ఒక్క మాట ‘కాంతార’ సినిమా విజయం సాధించాక మొత్తం శాండిల్ వుడ్ ఆ సినిమాను భుజానికెత్తుకుంది.