పోస్టర్ లో కనిపించినంత స్లిమ్ గా ఫోటోలో కనిపించట్లేదేంటి ?

  • November 8, 2017 / 07:03 AM IST

మనం ఒక మామూలు పాస్ పోర్ట్ సైజ్ ఫోటో దిగితేనే.. ఫోటో తీసినోడి పక్కన కుర్చీ వేసుకొని కూర్చొని మరీ మొహం మీద ఏమైనా గాట్లు లేదా మచ్చలు ఉంటే తీసేయమని చెప్పడంతోపాటు.. కలర్ కూడా కాస్త బ్రైట్ చేయమని అడుగుతుంటాం. అలాంటిది ఒక సినిమా ఫస్ట్ లుక్ కోసం పబ్లిసిటీ డిజైనర్లు పడే శ్రమ మామూలుగా ఉంటుందా. అయితే.. ఒక్కోసారి సదరు పబ్లిసిటీ డిజైనర్లు అత్యుత్సాహం ప్రదర్శించి పోస్టర్ లోని హీరో/హీరోయిన్ ను అత్యంత అందంగా చూపించడం కోసం చూపే ఆరాటంలో అనుకోకుండా కొన్ని తప్పులు చేస్తుంటారు.

తాజాగా అనుష్క నటించిన “భాగమతి” ఫస్ట్ లుక్ విషయంలో అలాంటి పెద్ద తప్పే దొర్లింది. “సైజ్ జీరో” తర్వాత అనుష్క మళ్ళీ నార్మల్ షేప్ కి రాలేకపోయిందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ.. నిన్న అనుష్క పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన “భాగమతి” ఫస్ట్ లుక్ పోస్టర్ లో మాత్రం అనుష్క తన మొదటి సినిమా “సూపర్”లో కనిపించినంత స్లిమ్ లుక్ లో దర్శనమిచ్చింది. కట్ చేస్తే.. అనుష్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ “భాగమతి” సినిమాలో కీలకపాత్ర పోషించిన విద్యురామన్ పెట్టిన ఫోటోలో మాత్రం అనుష్క మాములుగానే హెవీ లుక్ లో కనిపించేసరికి షాక్ అయ్యారు స్వీటీ ఫ్యాన్స్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus