అనుష్క అతనికి మరో అవకాశం ఇస్తుందా ??

కారణం ఏంటో తెలియదు కానీ.. కొన్ని సంవత్సరాలపాటు చెట్టాపటాలేసుకొని తిరిగిన అనుష్క శర్మ-విరాట్ జంట ఉన్నట్లుండి విడిపోయింది. బాలీవుడ్ మీడియా ఎంత ప్రయత్నించినా కూడా ఇద్దరి దగ్గర నుండి సమాధానం మాత్రం రాబట్టలేకపోయింది.
అయితే.. కొన్ని నెలల విరామం అనంతరం అనుష్క-విరాట్ ఓ పార్టీలో కలిసి కనిపించారు. ఒకరికి తెలియకుండా ఒకరు హాజరైనప్పటికీ.. పార్టీ అయిపోయాక అనుష్క కారు ఎక్కే వరకూ ఆమెకు ఎస్కార్ట్ లా మారి మరీ సాగనంపాడు విరాట్.
ఆ సమయంలో వీరిద్దరినీ దగ్గరనుండి గమనించిన వారందరూ.. అనుష్క మనసు కరిగి విరాట్ కు మరో అవకాశం ఇస్తున్నట్లుగా ఉందని భావించారు. మరి వారి భావన ఎంతవరకు నిజమవుతుందో చూడాలి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus