Prabhas, Balakrishna: ఆదిపురుష్ మూవీ గురించి అలాంటి ప్రచారం.. కానీ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ రాముని పాత్రలో ఆదిపురుష్ సినిమాలో నటించగా ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానుందనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒకసారి రిలీజ్ డేట్ ను మార్చుకున్న ఈ సినిమా బాలయ్య హీరోగా నటించిన వీరసింహారెడ్డి సంక్రాంతికి రిలీజ్ కానున్న నేపథ్యంలో మళ్లీ రిలీజ్ డేట్ ను మార్చుకునే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. ఇప్పటికే విడుదలైన ఆదిపురుష్ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే.

త్వరలో ఆదిపురుష్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ కానుండగా ట్రైలర్ కు కూడా పాజిటివ్ టాక్ రావడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సంక్రాంతి కానుకగా ఆదిపురుష్ ను రిలీజ్ చేసి నెగిటివ్ టాక్ వస్తే ఆదిపురుష్ మేకర్స్ కు భారీ రేంజ్ లో నష్టం తప్పదనే సంగతి తెలిసిందే. అయితే ఆదిపురుష్ మూవీ వాయిదా పడుతుందో లేదో అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలయ్య నటించిన వీరసింహారెడ్డి ఒక్కరోజు గ్యాప్ లో థియేటర్లలో రిలీజ్ కానున్నాయని బోగట్టా.

రెండు టైటిల్స్ లో వీర అనే పదం కామన్ గా ఉండగా ఈ రెండు సినిమాలలో ఏ సినిమా విజేతగా నిలుస్తుందో చూడాల్సి ఉంది. సంక్రాంతి కానుకగా విడుదలైన బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. 2023 సంక్రాంతి పోటీ మాత్రం ఊహించని రేంజ్ లో ఉండనుందని తెలుస్తోంది.

సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు థియేటర్ల కేటాయింపు కూడా సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్ సంఖ్య అంతకంతకూ తగ్గుతుండగా చాలా కాలం తర్వాత చిరంజీవి, బాలయ్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుండటం గమనార్హం.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus