మలయాళంలో సూపర్ హిట్ అయిన “కమ్మటిపాదం” చిత్రాన్ని తెలుగులో అఖిల్ హీరోగా రీమేక్ చేయనున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం కూడా వహిస్తారని చెప్పుకొన్నారు.
అయితే.. గత శుక్రవారం “కమ్మటిపాదం” చిత్రాన్ని హైద్రాబాద్ లో విడుదల చేశారు. అక్కడ సూపర్ హిట్ అయ్యింది కదా అన్న ఆసక్తితో సదరు చిత్రాన్ని ఇక్కడ వీక్షించినవారందరూ హతాశులయ్యారు.
కేవలం నేటివిటీ కారణంగా ఘన విజయం సాధించిందే కానీ మరో కారణం ఏమీ లేదని, చాలా సాదా సీదా కథ, చిత్రవిచిత్రమైన మలుపులు తిరిగిన కథనం తెలుగువారిని మాత్రమే కాక రెగ్యులర్ సినిమా వీక్షకులను కూడా ఆకట్టుకోలేకపోయిందని తెలుస్తోంది.
దాంతో.. ఈ సినిమాను అఖిల్ చేయకపోవడమే మంచిది, లేదంటే మనోడి కెరీర్ లో మరో డిజాస్టర్ గా ఈ సినిమా నిలవడం ఖాయమంటూ విశ్లేషణలు వెల్లడించారు!