విజయ్ తమ్ముడు అలరిస్తాడా?

  • June 27, 2019 / 04:46 PM IST

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘దొరసాని’. ఈ చిత్రంతో జీవితా రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక కూడా హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ‘మధుర ఎంటర్ టైన్మెంట్స్’ ‘బిగ్ బెన్’ సినిమాలు కలిసి నిర్మిస్తున్నఈ చిత్రం జులై 12న విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి స్పందన లభించింది. డిఫరెంట్ లవ్ స్టోరీ గా ఈ చిత్రం రూపొందింది. ఇక ఈ చిత్రం చాలా బాగా వచ్చిందని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.

ఈ చిత్రంలో టైటిల్ రోల్ ప్లే చేస్తోన్న శివాత్మిక అద్భుతంగా నటించిందట.. ఈ చిత్రం తర్వాత ఈమెకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయమని చిత్రబృందం కూడా చెబుతుంది. ఇక ఆనంద్ దేవరకొండ కూడా చాలా నేచురల్ గా నటించాడట. ఇక ఈ జంట సూపర్ హిట్ కొట్టడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి వారు మాటల్లో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే చిత్రం విడుదలయ్యేవరకూ వేచిచూడాల్సిందే. విడుదలైన పాటలకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి సినిమా పైన మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారి అందించిన ట్యూన్స్ కుర్రకారుని బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ చిత్రం ఎంతవరకూ నిలబడుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus