మహేష్ బాబు “బాహుబలి” రికార్డులను బద్దలుకొడతాడా??

  • May 20, 2016 / 01:57 PM IST

మహేష్ బాబు తాజా చిత్రం “బ్రహ్మోత్సవం” నేడు విడుదలయ్యింది. ఇప్పటికే చాలా చోట్ల ఈ సినిమా టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయి. మొదటి రెండు రోజులు సినిమా టేకిట్లు దొరకడం ప్రస్తుతానికి గగనం అయిపోయింది.

ముఖ్యంగా.. ఈ సినిమా తెలంగాణాలో మొదటిరోజు అన్నీ థియేటర్లలో అయిదు షోలు ప్రదర్శితమవ్వడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంతో.. “బ్రహ్మోత్సవం” మొదటిరోజు కలెక్షన్లు “బాహుబలి”ని మించడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

అయితే.. సినిమాకు విపరీతమైన నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడం, ఆఖరికి మహేష్ బాబు అభిమానులు కూడా చూడలేని (భరించలేని) స్థాయిలో సినిమా ఉండడంతో.. “బాహుబలి” రికార్డులను పక్కన పెట్టండి, అసలు కనీస స్థాయి కలెక్షన్స్ వస్తాయా లేదా? అని నిర్మాతలు భయపడుతున్నారట. మరి “బ్రహ్మోత్సవం” సినిమా ఏస్థాయి కలెక్షన్స్ సాధిస్తుంది అనే విషయం మరో రెండు రోజుల్లో తేలిపోనుంది!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus