మెగా బ్యానర్ చక్రం తిప్పుతుందా??

  • June 15, 2016 / 06:42 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమంలో టాప్ బ్యానర్ పేర్లు చెప్పగానే గుర్తొచ్చే బ్యానర్స్ లో మెగా బ్యానర్ ఒకటి. అయితే ఆ బ్యానర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు రావడంతో ఆ బ్యానర్ లో ఒక సినిమా వస్తుంది అన్నా…లేదంటే ఆ బ్యానర్ బడే చేసుకుని ఒక సినిమా విడుదల అవుతుంది అన్న ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.

ఇక అదే ప్రత్యేకత చిన్న, పెద్ద అని తేడా లేకుండా ఉపయోగపడుతుంది. ఇంతకీ విషయం ఏమిటంటే….చిన్న సినిమాకు ఊపిరి పొయ్యాలి అంటూ ఎందరో సో కాల్డ్ బడా బాబులు ఎప్పటికప్పుడు వేదికలపై సోది చెబుతూ గొప్పతనంతో జబ్బలు చరుచుకుంటారు. అయితే అలాంటి చిన్న సినిమాకు అండగా నిలబడి తానున్నాను అంటూ బరిలోకి దిగారు మెగా నిర్మాత అల్లు ఆరవింద్..ఇంతకీ ఏంటి ఆ సినిమా అంటే…”మీకు మీరే మాకు మేమే” సినిమా. నాన్నకు ప్రేమతో లాంటి మంచి సినిమాకు కథ అందించిన హుస్సెన్ షా కిరణ్.. మొదటి సారి దర్శకత్వం వహించిన సినిమా మీకు మీరే మాకు మేమే.. సుకుమార్ మెచ్చిన ఈ రచయిత దర్శకుడిగా మారి తీసిన సినిమా ఇది.

ఇక హిట్ దర్శకుడు మెచ్చిన దర్శకుడి సినిమా కావడంతో, అల్లు ఆరవింద్ ఈ సినిమాను తానే విడుదల చేస్తున్నాడు. అంతేకకాకుండా జూన్ 17న నాని జెంటిల్ మెన్ అంటూ వస్తున్నా సినిమా మీద ఉన్న నమ్మకంతో పోటీగా రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక సినిమా మొత్తం గీతా సమర్పణలో వదలడం దీనికి ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది. ఏది ఏమైనా…అల్లు ఆరవింద్ సినిమాను సమర్పిస్తున్నాడు అంటే…సినిమాలో స్టఫ్ ఉండే ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus