“కత్తి” చిరుకి రాజకీయంగా కలసి వస్తుందా!!!

  • April 27, 2016 / 08:20 AM IST

మెగా అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఆగ ఎదురు చూస్తున్న మెగా స్టార్…150వ సినిమా ‘కత్తిలాంటోడు’ హంగామా మొదలైపోయింది. అయితే ఇప్పటివరకూ ఈ సినిమా కధ విషయంలో టాలీవుడ్ లో, అభిమానుల్లో పెద్ద రచ్చ రేగింది…అదంతా ఒక కొలిక్కి వచ్చింది అని అనుకునే లోపే…ఈసినిమాలోని చాల సన్నివేశాలు చిరంజీవి తన పొలిటికల్ రీ లాంచ్ కు అనుగుణంగా మార్చుకోబోతున్నాడని వార్తలు హల్చల్ చేస్తున్నాయి..ఇంతకీ విషయం ఏమిటంటే….

ఈసినిమాలో కొన్ని సీన్స్ నేటి రాజకీయాలను ముఖ్యంగా అమరావతి నిర్మాణం కోసం రైతులు దగ్గర భూములను తీసుకున్న నేపధ్యాన్ని హైలెట్ చేస్తూ అందులోని రాజకీయ కోణాలను టార్గెట్ చేసే విధంగా ‘కత్తి’ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ తయారైంది అన్న వార్తలు వస్తున్నాయి. ద గుడ్ లైఫ్, ట్రిపికల్ అటాక్, ఎ న్యూ స్టెప్ వంటి క్యాప్షన్స్ తో నిన్న విడుదలైన ‘కత్తి’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను బట్టి చిరంజీవి తన పొలిటికల్ రీ ఎంట్రీకి సాధనంగా ఈసినిమాను వాడుకోబోతున్నాడు అన్న సంకేతాలు వస్తున్నాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతవరకూ బాగానే ఉంది కానీ అసలు చిరు ఏరకంగా పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు….ప్రస్తుతం కాంగ్రెస్ ను ఆధారంగా చేసుకుని అడుగులు వేస్తాడా ? లేదంటే భారతీయ జనతాపార్టీని దగ్గర చేసుకుని చిరంజీవి రాజకీయ ఎత్తుగడలు ప్రదర్శిస్తాడా ? లేకుంటే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ‘జనసేన’ ను తన పొలిటికల్ రీ ఎంట్రీకి ఆయుధంగా మార్చుకుని సంచలనాలు సృష్టిస్తాడా ? అన్న విషయంపై టాలీవుడ్ లోనే కాదు, పొలిటికల్ సర్కిల్స్ లో కూడా హాట్ హాట్ గాసిప్స్ వినిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా…మన మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకి ముహూర్తం కుదరడంతో మెగా ఫ్యా్న్స్ లో ఆనందం ఉరకలు వేస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus