అఖిల్ కి అండగా చరణ్, ఎన్టీఆర్..!

Advertisement

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ‘బ్రహ్మోత్సవం’ ‘స్పైడర్’ చిత్రాలు ఏ రేంజ్ లో దెబ్బ కొట్టాయో.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ రెండు చిత్రాలు డిజాస్టర్లు కావడంతో మహేష్ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక వీటి తరువాత ‘భరత్ అనే నేను’ చిత్రంతో బ్లాక్ బ్లాస్టర్ హిట్టందుకున్నాడు. కొరటాల శివ టేకింగ్.. మహేష్ నటన.. ఈ చిత్ర విజయంలో కీలక పాత్రను పోషించాయి. అయితే ఈ చిత్రానికి ప్రమోషన్ కూడా అదే రేంజ్ లో చేసారు. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిదిగా రావడం ఒకటైయితే… ఈ చిత్రం విడుదలకు ముందు మహేష్… రాంచరణ్,ఎన్టీఆర్ లకి పార్టీ ఇవ్వడం మరో విశేషం.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ నాగార్జున తనయుడు అఖిల్ కు కూడా రిపీట్ అవ్వబోతున్నట్టు కనిపిస్తుంది. అఖిల్ కి కూడా మహేష్ లాగా ‘అఖిల్’ ‘హలో’ వంటి రెండు డిజాస్టర్లతో రేస్ లో వెనుక ఉన్నాడు. అక్కినేని నటించిన ‘మిస్టర్ మజ్న’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా జూ.ఎన్టీఆరే… చీఫ్ గెస్ట్ గా విచ్చేశాడు. అంతే కాదు.. చిత్ర విడుదలకు ముందు… అఖిల్ కూడా చరణ్, తారక్ లకు పార్టీ ఇచ్చాడు. సో లెక్క ప్రకారం చూసుకుంటే మహేష్ కి జరిగినట్టే అఖిల్ కి కూడా జరుగుతుండడం … సెంటిమెంట్ రిపీట్ అవుతుందనే సందేహం రాక మానదు. ‘తొలిప్రేమ’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ వెంకీ అట్లూరి పై కూడా ఆడియన్స్ కి నమ్మకం ఉంది. మరి ఈ సెంటిమెంట్ అఖిల్ కు ఎంత వరకు కలిసొస్తుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read