Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

ఒకప్పుడు టాలీవుడ్‌లో ఇది అవార్డు తెచ్చిపెట్టే సినిమా.. ఫలితం గురించి మాట్లాడకూడదు అని అనేవారు మీకు గుర్తుండే ఉంటుంది. అందుకు తగ్గట్టే ఆ సినిమాల వసూళ్లు సరిగ్గా వచ్చేవి కావు. కానీ ఒక ఏడాది తర్వాత ఆ సినిమాకు, లేదంటే అందులో నటించిన ప్రధాన నటులకు పురస్కారం వచ్చినప్పుడు ఆ సినిమాను, టీమ్‌ను తెగ అభినందించేసేవారు. ఇప్పుడు ఇలానే జరుగుతుంది అని చెప్పలేం కానీ.. ఇందులో ఓ కీలకమైన అంశం ‘పెద్ది’ సినిమా విషయంలో జరుగుతుంది అని అంటున్నారు. ఇక్కడ సినిమాకు వస్తుందో లేదో కానీ.. హీరో రామ్‌చరణ్‌కి అయితే వస్తుందని చెప్పేయొచ్చు.

Peddi

రామ్‌చరణ్‌ – బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘పెద్ది’. రూరల్‌ బేస్డ్‌ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. ప్రీమియర్లు అయితే నిన్న రాత్రే పడ్డాయి. ఫలితం విషయంలో ఒక్కోరు ఒక్కో మాట అంటున్నారు కానీ. ఓ విషయంలో మాత్రం అందరూ ఒకటే మాట అంటున్నారు. అదే ‘పెద్ది’కి అవార్డు. అది కూడా నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు. సినిమా తీసిన విధానంలో, చూపించిన విధానంలో కంప్లైంట్‌లు వినిపిస్తున్నా.. ‘పెద్ది’ పాత్రను రామ్‌చరణ్‌ పోషించిన విధానంలో, దాని కోసం ఆయన పడ్డ కష్టం విషయంలో ఎలాంటి ఫిర్యాదులు లేవు.

‘పెద్ది’ పాత్రలో రామ్‌చరణ్‌ ఒదిగిపోయిన విధానం.. పాత్ర కోసం అతను పడ్డ శారీరక, మానసిక శ్రమ.. సినిమా ఆఖరి గంటలో రామ్‌చరణ్‌ నటన.. మల్లయుద్ధం కోసం తీసుకున్న రిస్క్‌, ఆఖరి విజయం తర్వాత స్పీచ్‌ సమయంలో హావభావాలు.. ఇవన్నీ చరణ్‌కు జాతీయ అవార్డు తెచ్చి పెడతాయి అని చెబుతున్నారు. మామూలుగా బాలీవుడ్‌లో ఇలాంటి కథలకే అవార్డులు దక్కుతూ ఉంటాయి. మరిప్పుడు రామ్‌చరణ్‌కి ఆ అవకాశం దక్కుతుందా? ‘పెద్ది’ కోసం ఆయన పడ్డ కష్టం పురస్కారం రూపంలోకి మారుతుందా? ఇది తేలాలంటే మరో ఏడాదైనా ఆగాల్సిందే.

పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus