ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా??

  • August 22, 2016 / 12:06 PM IST

ఎన్టీఆర్ అంటేనే…ఒక ప్రభంజనం….బడా హీరోలు ఎన్నో సినిమాలు తరువాత సాధించిన ఘనత ఎన్టీఆర్ అతి కొద్ది కాలంలోనే, అత్యంత చిన్న వయసులోనే సాధించి తన సత్తా ఏంటో టాలీవుడ్ కి చూపించాడు. అయితే అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు వరుస హిట్స్ తో మంచి ఊపు మీద కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ కొరటాల దర్శకత్వంలో నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’పై భారీ అంచనాలే పెట్టుకున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అయితే ఎన్టీఆర్ గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి ఒక సెంటిమెంట్ కలసి వచ్చేలా ఉంది.

ఆది ఏమిటి అంటే….సినిమా షూటింగ్ మరియు వర్క్ చాలా హడావిడిగా జరగడమే….విషయంలోకి వెళితే…ఇప్పటికే ఆగష్టు నుంచి సెప్టెంబర్ కి వాయిదా వేశాడు ఎన్టీఆర్. అయితే చాలా సమయం ఉంది అని  అనుకున్నప్పటికీ ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. చివరి ఐటమ్ పాట షూటింగ్ లో ఉండడంతో, అదే క్రమంలో ఒకట్రెండు చిన్న సన్నివేశాలు కూడా పెండింగ్ లో ఉండడంతో, ఆ తరువాత…ఫైనల్ మిక్సింగ్ పూర్తి చేసి.. సర్వం సిద్ధం చేసేసరికి ఇంకో వారం రోజులైనా పట్టే అవకాశం ఉంది.

అంతేకాకుండా అటుపై సెన్సార్.. ప్రమోషన్.. విదేశాలకు డిస్కులు పంపించడం ఇలా చాలా తతంగం ఉంది. అయితే ఇప్పుడు ఈ హడావిడి హంగామానే ఎన్టీఆర్ కి సెంటిమెంట్ గా మారింది…ఎందుకంటే…ఈ మధ్య ఎన్టీఆర్ సినిమాలన్నింటికీ చివర్లో ఇలాంటి హడావుడే కనిపిస్తోంది. టెంపర్.. నాన్నకు ప్రేమతో సినిమాలకు కూడా ఇలాగే జరిగింది. ఐతే ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆ హడావుడినే సెంటిమెంటుగా భావించి.. ‘గ్యారేజ్’ విషయంలోనూ లేట్ చేస్తున్నారో ఏమో కానీ. మొత్తానికి ఎన్టీఆర్ అనుకున్న టైమ్ కే వస్తాడు అని ఆశిద్దాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus