ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు కొన్నాళ్ల క్రితం అధికార ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. దానికి సరైన కారణాలు తెలియనప్పటికీ.. ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కొరటాల శివతో చేయబోతున్నాడు. ఇక త్రివిక్రమ్.. మహేష్ బాబు హీరోగా సినిమా మొదలుపెట్టనున్నారు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాల్సిన పరిస్థితి కలుగుస్తోంది. అది కూడా వడ్డీతో సహా అని తెలుస్తోంది.
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాను హారిక హాసిని సంస్థ నిర్మించాల్సి ఉంది. అది త్రివిక్రమ్ సొంత ప్రొడక్షన్ హౌస్ లాంటిది. కాబట్టి అక్కడ అడ్వాన్స్ ల గురించి ఎలాంటి చర్చ ఉండదు. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా చేతులు కలిపింది. నందమూరి కళ్యాణ్ రామ్ భాగస్వామి. దీంతో కళ్యాణ్ రామ్ తన చేతుల మీదుగా త్రివిక్రమ్ కి కోటి రూపాయల అడ్వాన్స్ ఇచ్చారట. ఆ కోటి వడ్డీతో సహా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత త్రివిక్రమ్ పై పడింది. నిజానికి త్రివిక్రమ్ ఇదేమంత పెద్ద అమౌంట్ కాదు.
కానీ ఓ నిర్మాత దగ్గర నుండి తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి రావడం త్రివిక్రమ్ కెరీర్ లో ఇదే మొదటిసారి. మరి కళ్యాణ్ రామ్ అడ్వాన్స్ తిరిగి తీసుకుంటాడో లేక ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి డీల్ మాట్లాడుకుంటాడో చూడాలి. మరోపక్క ఎన్టీఆర్-కొరటాల శివ ప్రాజెక్ట్ లో కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ ని భాగం చేయాలనుకుంటున్నాడు కళ్యాణ్ రామ్. నిజానికి ఈ సినిమాను కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మించాలనుకుంటున్నాడు. ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తే నిర్మాతల జాబితాలో కళ్యాణ్ రామ్ పేరు కూడా ఉండొచ్చు.
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!