Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

‘జైలర్‌ 2’ సినిమా గురించి గత కొన్ని నెలలుగా మాట్లాడుకుంటున్నప్పుడు ఎక్కువగా వినిపించిన అంశాల్లో సినిమాల్లోని కేమియోలు ఒకటి. ఈ సినిమాలో రజనీకాంత్‌కి అవసరం వచ్చినప్పుడు దేశంలోని ప్రముఖ పాజిటివ్‌ రౌడీలు, గన్‌లు– కత్తులు పట్టుకు తిరిగే సంఘ సంస్కర్కలు చాలామంది ముందుకు వస్తుంటారు. ఏమన్నా అంటే 20 ఏళ్ల క్రితం మీరు చేసిన సాయంతో పోలిస్తే ఇదెంత అంటారు. ఇలాంటి పాత్రలు చేయడానికి అన్ని భాషల నుండి హీరోలను తీసుకొస్తుంటారు.

Jailer 2

అలా ‘జైలర్‌’లో మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, జాకీ ష్రాఫ్‌ వచ్చారు. ‘జైలర్ 2’లో కూడా వారితోపాటు మరికొందరు వస్తారు అని వార్తలొచ్చాయి. అనుకున్నట్లే వారంతా ఈ సినిమాలో వచ్చి టైగర్‌ ముత్తువేల్‌ పాండియన్‌కు ప్రతిసారి సాయం చేశారు. అయితే రూమర్లు వచ్చిన హీరోలు/ నటులు కొంతమంది ఈ సినిమాలో కనిపించలేదు. ఇద్దరు కనిపించినా కాసేపే కనిపించారు. దీంతో ఏమైందా అని ఆరా తీస్తే ఆ సీన్స్‌ ఎడిటింగ్‌లో తీసేశారు అని తేలింది.

అలా ఎడిట్‌ అయిపోవారిలో ప్రముఖ తమిళ కమెడియన్‌ సంతానం ఒకరు. సెకండాఫ్‌లో ఆయనతో కొన్ని కామెడీ సీన్స్‌ రాశారు. కానీ సినిమాలో పూర్తి కనిపించలేదు. ఇక విజయ్‌ సేతుపతి ఉన్నా.. ఒకటే సీన్‌, ఒకటే డైలాగ్‌కి పరిమితం అయిపోయారు. మోహన్‌ లాల్ అయితే ఒక డైలాగ్‌, మూడు సీన్లకు క్లోజ్‌. ఎడిటింగ్‌లో వారి సీన్స్‌ కూడా లేపేశారు అని చెబుతున్నారు. ఇలా తీసేసిన వారిలో శివ కార్తికేయన్ కూడా ఉన్నాడని సమాచారం.

ఈ లెక్కన ఈ కట్‌ చేసేసిన సీన్స్‌ ఏం చేస్తారు అనేదే ఇప్పుడు ప్రశ్న. ఓటీటీలో సినిమా వచ్చినప్పుడు ఆ సీన్స్‌ యాడ్‌ చేస్తారా? లేక మూడో ‘జైలర్‌’ కోసం తమ వద్దే ఉంచుకుంటారా అనేది చూడాలి. ఎందుకంటే మూడో ‘జైలర్‌’ కూడా మొదటి రెండు ‘జైలర్‌’ల ప్యాటర్న్‌లోనే ఉండబోతోంది. అప్పుడు కూడా హీరో పాత్రకు కొంతమంది సాయం చేయాలి. కాబట్టి అప్పుడు వాడేయొచ్చు. అందులోనూ కాంత (విద్యాబాలన్‌) మేడమ్‌కి విజయ్‌ సేతుపతి పాత్ర కీలకం అని ‘జైలర్‌ 2’ క్లైమాక్స్‌లో చెప్పారు కూడా.

4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus