మల్లు భామకి మతిపోయే ఆఫర్ ఇచ్చారు!

ఓ పాట‌లో ప్రియ ప్రకాష్ వారియర్ కన్ను కొట్టగానే లక్షల మంది యువత ఆమె ఎక్స్ ప్రెష‌న్స్ కి, ఆమె అందానికి దాసోహం అయిపోయారు. ఆ తర్వాత ఆమె కోసం డైరెక్ట‌ర్లూ యాడ్ ఫిల్మ్ మేక‌ర్లు నిరీక్షించడం మొద‌లుపెట్టారు. ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ అంద‌రూ ఇండ‌స్ట్రీ చుట్టూ తిరుగుతుంటే ఆమె మాత్రం త‌న చుట్టూ ఇండ‌స్ట్రీని తిప్పుకుంటోంది. వ‌రుస అవ‌కాశాలు కొల్ల‌గొట్టేస్తుంది. ఊహించ‌ని రీతిలో ఆనందం ఆమెని చుట్టుముట్టేస్తోంది. బాలీవుడ్ లో ర‌ణ్ వీర్ హీరో గా న‌టిస్తున్న చిత్రంలో అడుగిడింది. రోహిత్ శెట్టి ఆ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

ప్రియా వారియ‌ర్ దేశ వ్యాప్తంగా మార్మోగిన పేరు. “ఒరు ఆధార్ ల‌వ్” అనే మ‌ల‌యాళం సినిమాతో తెరంగేట్రం చేసిన పిల్ల‌. క‌న్నుకొట్టి కుర్ర కారు మ‌న‌సుల‌ను కొల్లగొట్టేసిన భామ‌.అందం అభినయం రెండూ త‌న సొంత‌మేన‌ని చాటుతున్న చ‌క్క‌ని చుక్క‌. ఇప్పుడు ఓ యాడ్ కోసం కోటి రూపాయ‌లు కొట్టేసింది.ఆశ్చ‌ర్య‌మే క‌దూ! ఇది ఓ జాతీయ ప్ర‌క‌ట‌న అని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇప్ప‌టికే ఇన్ స్టా గ్రాం లో ఓ యాడ్ ని ప్ర‌మోట్ చేయాలంటే ఎనిమిది ల‌క్ష‌ల రూపాయ‌లు తీసుకుంటుందీ చిన్న‌ది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus