నాగార్జున ఇంటిముందు హడావుడి చేసిన యువతి

  • July 4, 2018 / 07:52 AM IST

అభిమానులతో స్టార్స్ కి ఆనందమే కాదు.. కష్టాలు కూడా ఎదరవుతుంటాయి. హీరోయిన్స్ కనిపిస్తే వారిమీదపడి చికాకు తెప్పిస్తుంటారు. తాకి పైశాచికానందం పొందే అభిమానులు లేకపోలేదు. అలాగే హీరోలు పలురకాలుగా అభిమానులతో ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా నాగార్జునకు చేదు అనుభవం ఎదురయింది. నాగార్జున ఇంటి వద్ద మంగళవారం రాత్రి ఓ యువతి హడావుడి చేసింది. వివరాల్లోకి వెళితే … ఆదిలాబాద్‌కు చెందిన విజయ అనే మహిళ మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్‌కు చేరుకుంది. రోడ్డు నంబరు 51లో ఉన్న నాగార్జున ఇంటికి వెళ్లింది. హీరో నాగార్జునను కలవాలని..తనతో మాట్లాడాలని నాగ్ పీఏని కోరింది.

కానీ ఆయన లేరని.. షూటింగ్ పనిపై బయటకు వెళ్లారని అక్కడ సిబ్బంది తెలిపారు. అయినా ఆమె కదల్లేదు. పోనీ ఏ విషయం మీడయా కలవడానికి వచ్చావు? అని ప్రశ్నిస్తే ఆమె షాకిచ్చింది. నాగార్జున తనకు 4 కోట్లు ఇవ్వాలని చెప్పడంతో నాగ్ పీఏ ఆశ్చర్యపోయాడు. ఆమెను సముదాయించడానికి చాలా ప్రయత్నించారు. అయినా రచ్చ చేయడం ఆపలేదు. ఇంకా ఏమి చేయాలో తెలియక పోలీసులకు సమాచారం అందించారు. యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా ఆమె మానసిక స్థితి బాగాలేదని తేలింది. దీంతో నాగార్జున సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus