Chiranjeevi: మెగాస్టార్ సినిమాలో మార్పులు!

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ సినిమాను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. తెలుగు ఆడియన్స్ కు తగ్గట్లుగా ఈ సినిమాలో కొన్ని కీలకమార్పులు చేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవల ఊటీలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త వెలుగులోకి వచ్చింది.

సినిమా టెక్నికల్ టీమ్ లో రైటర్ గా పని చేస్తోన్న లక్ష్మీ భూపాల ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దానికి కారణాలు ఏంటనేవి మాత్రం బయటకు రాలేదు. రైటర్ గా లక్ష్మీ భూపాలకి ఇండస్ట్రీలో మంచి పేరుంది. నందిని రెడ్డి సినిమాలతో ఆయన బాగా ఫేమస్ అయ్యారు. మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ రావడంతో ఆయన స్టార్ రైటర్ అవుతారని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు.

ఆయన స్థానంలో మరో రైటర్ ని తీసుకోవడానికి టీమ్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే లక్ష్మీ భూపాల కొంత భాగం రాశారు. అందులో కొన్ని సన్నివేశాల షూటింగ్ కూడా జరిగింది. ఇప్పుడు మిగిలిన భాగాన్ని ఎవరితో రాయిస్తారో చూడాలి. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రాను తీసుకునే ఛాన్స్ ఉంది. గతంలో ఈయన మెగాస్టార్ నటించిన ‘ఖైదీ నెంబర్ 150’, ‘సైరా’ సినిమాలకు పని చేశారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Share.