Yash: డేంజరస్‌ క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. అయినా ట్రోలర్స్‌ ఊరుకుంటారా?

మొన్నీమధ్య నాని, ఆ తర్వాత విజయ్‌ దేవరకొండ.. ఇప్పుడు యశ్‌. ఏంటీ లిస్ట్‌ అనుకుంటున్నారా? సినిమా రిలీజ్‌కి ముందు ఆ సినిమా గురించి ఆఖరి రాగం పాడేసిన/ పాడేస్తున్న హీరోలు. ఇక్కడ ఆఖరి రాగం అంటే కొంతమందికి కోపం రావొచ్చు కానీ.. ఇక్కడ జరుగుతున్నది మాత్రం ఇదే. సినిమా గురించి విడుదల తర్వాత ప్రేక్షకులు ఏమంటారో.. ముందే సినిమా ప్రచారంలో ఆ హీరోలు చెప్పేసి.. ఆ సినిమా మీద చిన్నగా పాజిటివ్‌ ఇంపాక్ట్‌ ఇవ్వడం. ఇప్పుడు యశ్‌ ‘రామాయణ’ గురించి అదే చేశాడు అనిపిస్తోంది.

Yash

దీపావళి సందర్భంగా విడుదల కానున్న ‘రామాయణ’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా రావణుడి అలియాస్‌ యశ్‌ మాట్లాడుతూ.. భారతీయ సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలనే లక్ష్యంతో చేసిన చిత్రమే ‘రామాయణ’ అని చెప్పాడు. మనల్ని మనం ప్రపంచ స్థాయిలో నిలబెట్టుకోవడానికి ఇదొక గొప్ప ప్రయత్నం. ఈ సినిమాను అందరూ ఓపెన్‌ మైండ్‌తో చూడండి. దయచేసి చిన్న చిన్న లోపాల్ని వెతక్కండి అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

అలాగే రాముడి పాత్రను పోషించడం అంత సులభం కాదు. కానీ, రణ్‌బీర్‌ కపూర్‌ అద్భుతంగా చేశాడు అని కొనియాడాడు. మామూలుగా అయితే ఈ స్టేట్‌మెంట్లు పెద్ద విషయం కాదు. కానీ ఈ సినిమా విషయంలో గత కొన్ని నెలలుగా ఈ రెండు విషయాల మీదే విమర్శలు వస్తున్నాయి. రాముడి పాత్రను చూపించడంలో దర్శకుడు నితేశ్‌ తివారీ ఇబ్బంది పడ్డారని, ఇబ్బంది పెట్టారని కామెంట్లు వినిపించాయి. ఆ మాటకొస్తే దాదాపు అన్ని ముఖ్య పాత్రల విషయంలోనూ ఇదే జరిగింది.

ఇక విజువల్‌ ఎఫెక్ట్స్‌ గురించి అయితే పెద్ద కంప్లైంట్‌ల చిట్టానే ఉంది. ఈ సమయంలో యశ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇలా తప్పులు ఏమన్నా ఉంటే ఉండొచ్చు, వాటిని లైట్‌ తీసుకోండ అంటే.. ‘ది ప్యారడైజ్‌’, ‘రణబాలి’ సినిమాల ప్రీరిలీజ్‌/ ప్రెస్‌ మీట్‌లలో హీరోల మాటలు.. ఆ సినిమా తుది ఫలితాలు గుర్తొస్తున్నాయి.

ఆ బయోపిక్‌ మిస్‌ అయింది.. మరో సింగర్‌ కథతో రుక్మిణీ వసంత్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus