అలా నేనే తాగా : అమలా పాల్

  • September 19, 2017 / 03:23 PM IST

ప్రేమ ఖైదీ లో నేచురల్ గా నటించి తెలుగు వారికి దగ్గరైన అమల పాల్.. ఆ తర్వాత నాయక్, ఇద్దరమ్మాయిలతో అనే సినిమాలతో అభిమానులను సొంతం చేసుకుంది. నటిగా కొనసాగడానికి తన వివాహ బంధాన్ని సైతం వదులుకున్న ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. సిగరెట్ తాగుతూ.. అదీ ముక్కుల్లోంచి పొగ వదులుతూ హల్ చల్ చేసింది. అయితే ఆమె అమలాపాల్ కాదని, మార్పింగ్ చేశారని కొంతమంది, గ్రాఫిక్స్ ఉపయోగించారని మరికొంతమంది కామెంట్స్ చేశారు. అయితే దీనిపై తాజాగా అమలా పాల్ క్లారిటీ ఇచ్చింది. గ్రాఫిక్స్ చేయలేదని, తమిళ మూవీ కోసం ఇలా సిగెరెట్ తాగానని వివరించింది.

స్టోరీ ప్రకారం ఆ సన్నివేశంలో సిగరెట్ తాగాల్సి వచ్చిందని, డూప్ పెడతామని మేకర్స్ చెప్పినప్పటికీ ఒప్పుకోలేదని.. సహజత్వం కోసం తనే సిగరెట్ తాగడం నేర్చుకొని, నటించానని స్పష్టం చేసింది. ఎక్కువగా పొగతాగే వారికీ కూడా ముక్కు నుంచి పొగ వదలడం అనేది కషమైన పని.. అటువంటిది అమలాపాల్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus