దుమ్ములేపుతున్న అల్లు అర్జున్!!!

  • June 15, 2016 / 10:53 AM IST

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన అల్లు అర్జున్ కు తిరుగే లేకుండా పోయింది. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అల్లు అర్జున్, తన ఇమేజ్ ని క్రమ క్రమంగా పెంచుకుంటూ స్టైలిష్ స్టార్ గా మారిపోయాడు. అదే క్రమంలో లవర్ బోయ్ గా, దూసుకుపోతున్న అల్లు అర్జున్ ను పూర్తి మాస్ యాంగిల్ లో చూపించే ప్రయత్నం చేసి సక్సెస్ కొట్టాడు దర్శకుడు బొయపాటి.

వివరాల్లోకి వెళితే….బోయపాటి దర్శకత్వంలో ‘సరైనోడు’ చిత్రం బన్ని కెరీర్ లో మరుపురాని చిత్రంగా నిలిచిపోయింది. దాదాపుగా 80కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసి టాప్ హిట్ గా నిలిచింది. ఇక ఇక బన్నికి తెలుగు లోనే కాకుండా మలయాళంలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండటంతో ఈ చిత్రాన్ని మలయాళంలో ”యోధవు ” అనే పేరుతో రిలీజ్ చేశారు… అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీతోపాటు రిలీజైన రెండు మలయాళం చిత్రాల్లో ఒకటైన ‘మలబార్’ రెండు వారాల్లో కేవలం రూ.2.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది.

అయితే.. ‘యోధవు’ మాత్రం ఆ రెండు సినిమాలను వెనక్కు నెట్టి రూ.6.06 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ముందు వరుసలో నిలిచాడు. దీంతో.. కేరళలో ‘బాహుబలి’ తర్వాత అత్యధిక వసూళ్ళు రాబట్టిన సినిమాగా ‘సరైనోడు’ నిలిచింది. ‘బాహుబలి’ రూ.14 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లతో మొదటి స్థానంలో ఉంది. ఇలా క్రమక్రమంగా తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు బన్నీ..

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus