క్యాస్ట్ ప్రోబ్లమ్ తో ఇబ్బందుల్లో యంగ్ హీరో మ్యారేజ్

  • March 27, 2019 / 07:18 PM IST

అతడో యంగ్ హీరో.. చాన్నాళ్లు సైడ్ రోల్స్, విలన్ రోల్స్ చేసి ఎట్టకేలకు హీరోగా ఇప్పుడిప్పుడే అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఈ సమయంలోనే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ.. అతగాడి పెళ్ళికి క్యాస్ట్ ప్రోబ్లమ్ అడ్డొచ్చింది. ఇదంతా నిజం అనుకోని ఆ హీరో ఎవరా అని ఆలోచించేయకండి బాబు. ఇక్కడ రాసిందంతా నిజమే కానీ.. ఆ నిజం జరుగుతున్నది రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో. “బాహుబలి” ఫేమ్ రాకేష్ వర్రే కథానాయకుడిగా తెరకెక్కుతున్న “ఎవ్వరికీ చెప్పొద్దు” సినిమా కథాంశం ఇది.

మార్చి 22న విడుదలవ్వాల్సిన ఈ చిత్రం పలు కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యి.. ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతోంది. టీజర్, ట్రైలర్ వల్ల ఈ సినిమాకి మంచి బజ్ కూడా క్రియేట్ అయ్యింది. మరి ఈ సినిమా పెళ్లి చూపులు తరహాలో హిట్ అవుతుందో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus