“ఆ హీరో నన్ను రెమ్యూనరేషన్ విషయంలో మోసం చేశాడు లేదా ఆ హీరో కారణంగా నా సినిమా ఫ్లాప్ అయ్యింది, ఫలానా హీరో నాకు ప్రమోషన్స్ సమయంలో సపోర్ట్ చేయలేదు” అని హీరోల మీద ప్రొడ్యూసర్స్ కంప్లైంట్స్ ఇవ్వడం చూసి ఉంటాం. కానీ.. మొట్టమొదటిసారిగా ఓ యువ కథానాయకుడు తన కెరీర్ నాశనం అవ్వడానికి కారణం ఆ బడా ప్రొడ్యూసర్ అని చెప్పుకొని వాపోతున్నాడు. అయితే.. అది మీడియా ముందు చెప్పుకోవడం లేదు లెండి, తన స్నేహితుల దగ్గర, తన తోటి ఆర్టిస్టుల దగ్గర చెప్పుకొని బాధపడుతున్నాడు.
ఇంతకీ మేటర్ ఏంట్రా అంటే.. కెరీర్ కొత్తలో తనకు మంచి క్రేజ్ తోపాటు వరుస ఆఫర్స్ ఉన్నప్పుడు ఆ యువ హీరోతో వరుస సినిమాలు సైన్ చేయించుకొన్నాడు ఆ బడా నిర్మాత. హీరో అభీష్టానికి తగ్గట్లుగా కాకుండా తనకు నచ్చిన కథల్లో హీరోతో నటింపజేశాడు. దాంతో అప్పటివరకూ వరుస విజయాల్లో ఉన్న ఆ యువ కథానాయకుడు ఒక్కసారిగా ఫ్లాపులతో కొట్టుమిట్టాడాడు. ప్రస్తుతం మనోడి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. దాంతో.. ఇప్పుడు కొత్త ఆఫర్లు రాక, ఉన్న ఆఫర్లు మొదలవ్వక ఏం చేయాలో పాలుపోని సిచ్యుయేషన్ లో తన స్నేహితుల వద్ద బాధపడుతున్నాడట.