పోలిటికల్ బయోపిక్స్ తో బెంబేలెత్తుతున్న టాలీవుడ్

  • January 19, 2019 / 12:54 PM IST

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్నీ చిత్ర పరిశ్రమాల్లోనూ ప్రస్తుతం బయోపిక్ ల పర్వం నడుస్తోంది. ప్రస్తుతం అన్నీ ఇండస్ట్రీల్లో దాదాపు 9 బయోపిక్స్ ప్రొడక్షన్ లో ఉన్నాయి అంటేనే సదరు చిత్రాలకు ఏరేంజ్ డిమాండ్ ఉంది అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ మొదటి పార్ట్ విడుదలైంది. ఇక రాజకీయంగా కీలకమైన సెకండ్ పార్ట్ వచ్చే నెల 14న విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ఫిబ్రవరి 8న వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన “యాత్ర” కూడా విడుదలకానుంది. ఇక జయలలిత బయోపిక్ ఆల్రెడీ అండర్ ప్రొడక్షన్ లో ఉన్న విషయం తెలిసిందే.

మరి ఇంతమంది పొలిటీషియన్స్ బయోపిక్స్ వస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి జీవితం మీద బయోపిక్ ఎందుకు రాకూడదు అనుకున్నాడో ఏమో కానీ.. వెర్సటైల్ యాక్టర్ పోసాని కృష్ణమురళి అర్జెంట్ గా జగన్ పర్సనల్ & పోలిటికల్ లైఫ్ బేస్ చేసుకొని ఒక సినిమా మొదలెట్టాడు. ఆల్రెడీ చిత్రీకరణ కూడా మొదలైన ఈ చిత్రం ఆంధ్రాలో ఎలక్షన్స్ వేడి మొదలయ్యేలోపు విడుదల చేయాలనేది ప్లాన్. మరి ఆ ప్లాన్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుంది అనేది చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus