వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్ డే సందర్భంగా వై ఎస్ అర్ బయోపిక్ యాత్ర విడుదల!

  • September 12, 2018 / 11:57 AM IST

ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రిగా రాష్ట్ర‌ రాజ‌కీయాల్ని తిర‌గ‌రాసిన డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి జీవిత చరిత్ర ను యాత్ర పేరుతో భారీగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వై ఎస్ ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం.. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ యాత్ర. మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి వై ఎస్ ఆర్ పాత్రలో జీవిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ తో ఈ విషయం స్పష్టమైంది. మొదటి సింగిల్ సాంగ్ తో యాత్ర స్టోరీ లోని హై ఇంటెన్సిటీ చూపించారు. ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్ ఈ బ‌యెపిక్ ని తెర‌కెక్కిస్తున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎం ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ హంగులతో యాత్ర చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు. వై ఎస్ ఆర్ పార్టీ అధ్యక్షుడు, వై ఎస్ ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్ డే కానుకగా యాత్ర చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ…. మ‌డ‌మ‌తిప్ప‌ని నాయకుడి పాత్ర‌లో న‌టిస్తున్న మమ్మ‌ట్టి గారు… ప్ర‌జానాయ‌కుడు వై ఎస్ ఆర్ పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన యాత్ర మెద‌టి లుక్ కి, టీజ‌ర్ కి, ఫస్ట్ సింగిల్ కు రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల నుండి అనూహ్య‌మైన స్పంద‌న రావడంతో చాలా సంతోషంగా ఉంది. మా బ్యానర్ నుంచి భ‌లేమంచిరోజు, ఆనందోబ్ర‌హ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు యాత్ర హ్యాట్రిక్ చితంగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రంలో ఆద్యంతం ఎమోషన్ తో కూడిన పాత్ర‌లు, పాత్ర చిత్రణ కనిపిస్తుంది. తెలుగు ప్ర‌జ‌లంద‌రూ త‌ప్ప‌కుండా చూడ‌వ‌ల‌సిన చిత్రంగా తెర‌కెక్కిస్తున్నాం. దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ ప్రయాణంలో ఆయన చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆయన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి రాజకీయ ప్రజ్ఞాశాలి పాదయాత్ర లో జరిగిన వాస్తవిక, భావోద్వేగ సంఘటనలతో ఈ యాత్ర చిత్రాన్ని నిర్మిస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం. అని అన్నారు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus