మునుపెన్నడూ లేని విధంగా ఇంట్రెస్టింగ్ లైనప్ సెట్ చేసి సినీ ప్రియులని సర్ప్రైజ్ చేసింది ‘జీ5′(Zee5) సంస్థ. తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషలను కలుపుకొని క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్, AI ఆధారిత కథనాలు, యానిమేషన్, పిల్లల వినోదం వంటి విభిన్నమైన కంటెంట్ ఈలైనప్‌లో ఉండటం విశేషంగా చెప్పుకోవాలి.వినోదం మాత్రమే కాకుండా సంస్కృతిని ప్రభావితం చేయడం, భాషలతో పాటు సరిహద్దులను దాటి ప్రయాణించే కథలను సృష్టించడమే ‘జీ5’ లక్ష్యమని అర్దం చేసుకోవచ్చు.
వీరి లైనప్లో క్రేజీ ఫ్రాంచైజీలు, ప్రీమియం ఒరిజినల్స్ అలాగే సరికొత్త ఫార్మాట్స్ వరకు చాలా లేయర్స్ ని ఫాలో అవ్వడం జరిగింది.ఈ కంటెంట్ లైనప్‌కు టాప్ క్రియేటివ్ పార్ట్‌నర్స్ బలం కూడా తోడయ్యింది. భారతదేశంలోని ప్రముఖ స్టూడియోలు, దర్శకులు, కంటెంట్ క్రియేటర్స్‌తో కలిసి ‘జీ5’ ఈ భారీ ప్రాజెక్స్‌కు రూపకల్పన చేస్తోంది. ప్రాంతీయంగా చూస్తే మన కథ, అందులోని విషయ పరిజ్ఞానాన్ని మరింతగా బలోపేతం చేస్తూ తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్,
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, వృద్ధి సినిమాస్, తమిళంలో ఫ్యాషన్ స్టూడియోస్, కన్నడలో కెవిఎన్ ప్రొడక్షన్స్, మలయాళంలో తెస్పియాన్ ఫిల్మ్స్, మరాఠీలో బహవా ఎంటర్‌టైన్‌మెంట్, ప్రతిసాడ్ ప్రొడక్షన్స్, కైరా కుమార్ క్రియేషన్స్, బెంగాళీలో అక్రోపోలిస్ ఎంటర్‌టైన్మెంట్, అంజన్‌దత్ ప్రొడక్షన్స్, వై సో సీరియస్ ఫిల్మ్స్, సురేందర్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ వంటి ప్రముఖ సంస్థలతో జీ5 చేతులు కలిపింది.
హిందీలో జీయో స్టూడియోస్, మడాక్ ఫిల్మ్స్, ఏఏజెడ్ ఫిల్మ్స్, 200 నాటవుట్ సినిమాస్, డిఐసిఇ మీడియా, కలెక్టివ్ స్టూడియోస్, హిస్టరీవెర్సె, టిప్స్ ఫిల్మ్స్, పెన్ స్టూడియోస్, ఎలిప్సిస్ ఎంటర్‌టైన్‌మెంట్, రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్, జార్ పిక్చర్స్ వంటి ప్రముఖ సంస్థలు కూడా జీ5తో చేతులు కలిపాయి.హిందీ కంటెంట్ లైనప్‌లో కొత్త ఒరిజినల్స్, ఐకానిక్ ఫ్రాంచైజీల రీ-ఎంట్రీలు, భారీ సినిమాలు కలిపి ఒక స్ట్రాంగ్ మిక్స్‌గా రూపొందించారు.
కొత్త సిరీస్‌లలో కాంబ్లీ (క్రికెటర్ వినోద్ కాంబ్లీ జీవితంపై ప్రేరణతో), ది స్కామ్ లీక్డ్, కాఫీ కింగ్, జీనా ఐసీ కా నామ్ హై 2.0(ఆర్.మాధవన్ హోస్ట్‌గా), ఐకానిక్ జీ హారర్ షోతో పాటు రంగ్‌బాజ్ ఎస్4(మోహిత్ రైనా, అరుణోదయ్ సింగ్), జవావర్2(బువన్ అరోరా),బకైతి ఎస్2 (రాజేష్ తేలంగ్, షీబా ఛద్ధా) వంటి ఫ్రాంచైజీలు సందడి చేయనున్నాయి.సినిమాలను గమనిస్తే.. థియేట్రికల్ రిలీజ్‌లైన తర్వాత స్ట్రీమింగ్ కాబోయే సినిమాలతో పాటు డైరెక్ట్ టు డిజిటల్ రిలీజ్‌ల కాంబో కూడా కనిపిస్తోంది.
హై జవానీతో ఇష్క్ హోనా హై (వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మౌని రాయ్), బండార్ (బాబీ డియోల్, సాన్యా మల్హోత్రా), భారత్ భాగ్య విధాత (కంగనా రనౌత్), పూజా మేరీ జాన్ (మృణాల్ ఠాకూర్, హుమా ఖురేషీ), సర్వ్‌గుణ్ సంపన్న్(వాణీ కపూర్), ఘమాసాన్ (అర్షద్ వార్సీ, తిగ్మాంశు ధూలియా, ప్రతీక్ గాంధీ), ఇక్రూప్ (మిథిలా పాల్కర్, గౌహర్ ఖాన్), దలింప్ (జితేంద్ర కుమార్, ప్రియా బాపట్) వంటి ప్రాజెక్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
కొత్త కథలతో పాటు ప్రేక్షకులకు పరిచయమైన ఫ్రాంచైజీలను కూడా కలిపి ఈ లైనప్‌ను మరింత ఆసక్తికరంగా రూపొందించారు.“లాంగ్వేజ్ ఫస్ట్” స్ట్రాటజీని మరింత బలోపేతం చేస్తూ జీ5 తెలుగు, తమిళ, మరాఠీ, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లో సాంస్కృతికంగా బలమైన, నిజమైన కథలను అందించడంపై దృష్టి పెడుతోంది.తెలుగులో శ్రీమతి (నివేథా థామస్), అబ్జెక్షన్ మై లార్డ్ (శ్రీకాంత్) వంటి కొత్త ఒరిజినల్స్‌తో పాటు, బ్లాక్‌బస్టర్ టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా మళ్లీ వస్తోంది.
సినిమాల లైనప్‌లో వెంకీ అనీల్ రావిపూడి5, ఎన్‌బీకే111, వృషకర్మ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళంలో కూసే మునిసామి వీరప్పన్, తడయమ్ మళ్లీ వస్తుండగా కొత్త ఒరిజినల్స్‌గా అనంతకాలమ్, మొదటి ఇండిపెండెంట్ రాప్ బ్యాటిల్ షోగా తీ కురల్ రానున్నాయి. సినిమాల విషయానికి వస్తే డీ మాంటే కాలనీ3. హై(నయనతార, కవిన్), రావాడి వంటి భారీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి.కన్నడలో అయ్యనా మానె కొత్త సీజన్‌తో మళ్లీ రాబోతోంది.
అలాగే బిట్‌కాయిన్ స్కామ్, ఆపరేషన్ బంగార వంటి ఒరిజినల్స్ ఈ లైనప్‌ను మరింత బలోపేతం చేస్తున్నాయి. సినిమాల విభాగంలో రాజ్ బి. శెట్టి, ప్రజ్వల్ దేవరాజ్ నటించిన కరవాలి యాడ్ కానుంది. మలయాళంలో ఏ క్వీన్, మలబార్ కప్,మలయాళం తొలి ఇండిపెండెంట్ రాప్ బ్యాటిల్ షో కేరళ అండర్‌గ్రౌండ్ ప్రీమియర్ కానున్నాయి. ఈ సీజన్‌లో అత్యంత ప్రశంసలు పొందిన బాలన్ ది బాయ్ కూడా ఇందులో భాగమైంది. మరాఠీలో హె కే నవీన్?
కొత్త సీజన్‌తో పాటు అగ అయి, అహో ఆయి అనే కొత్త ఒరిజినల్, తుంబడ్చి మంజుల, భూతమ్ భయమ్ వంటి హిట్ సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. బెంగాలీలో ప్రేక్షకుల ఫేవరెట్ షోలు శ్వేత్‌కాళి, లాల్ బజార్ కొత్త సీజన్‌లతో తిరిగి వస్తున్నాయి. అలాగే అలూర్ దోస్, ప్రియో బొంధు వంటి షోలు ఒరిజినల్స్ లైనప్‌ను మరింత బలపరుస్తున్నాయి. మొత్తంగా, ప్రతి భాషలో స్థానిక సంస్కృతి, భావోద్వేగాలకు దగ్గరగా ఉండే కథలను అందిస్తూ జీ5 తన ప్రాంతీయ కంటెంట్‌ను మరింత విస్తరిస్తోంది.
ఈ సందర్భంగా జీ5 ఇండియా బిజినెస్ హెడ్ తేజ్‌కరన్ సింగ్ బజాజ్ మాట్లాడుతూ.. ‘‘జీ5లో మేం ఎంటర్‌టైన్‌మెంట్ ట్రెండ్స్‌ను కేవలం ఫాలో కావడం కాదు, వాటిని క్రియేట్ చేస్తున్నామని నమ్ముతున్నాం. మేం చెప్పే ప్రతి కథ ఒక సింపుల్ ఫిలాసఫీపై ఆధారపడి ఉంటుంది. విభిన్నమైన ఆలోచనలకు ప్రోత్సాహం ఇవ్వడం, ప్రేక్షకులు ఎక్కడా చూడని అనుభవాలను సృష్టించాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నాం. ఈ కంటెంట్ లైనప్ మా ఇప్పటివరకు ఉన్న అతిపెద్ద స్టేట్‌మెంట్.
ఇందులో భారతదేశంలోని అగ్ర దర్శకులు, నిర్మాణ సంస్థలు, నటీనటులు కలిసి సినిమాలు, సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్, AI ఆధారిత కథనాలు, అనిమేషన్, పిల్లల కంటెంట్‌ను ఏడు భాషల్లో అందిస్తున్నారు. అయితే ఇది మా మార్పులో ఒక భాగమే. కంటెంట్‌ను బలోపేతం చేయడమే కాకుండా, మరింత స్మార్ట్ టెక్నాలజీ, మెరుగైన ప్రొడక్ట్‌తో భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌ను కూడా మేం నిర్మిస్తున్నాం. భారతీయ ప్రేక్షకుల మారుతున్న అవసరాలకు అనుగుణంగా సేవలందించడం మా లక్ష్యం.
ఈ లైనప్ కేవలం టైటిల్స్ జాబితా మాత్రమే కాదు. ఇది భారతదేశంలోనే అత్యంత ఇష్టపడే స్వదేశీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌గా ఎదగాలనే మా లక్ష్యానికి ప్రతిబింబం. దేశంలోని అత్యంత ఆసక్తికరమైన కథలు, ప్రముఖ క్రియేటర్లు, ధైర్యమైన ఆలోచనలు అన్నీ ఒకే వేదికపై కలిసే స్థలంగా ZEE5గా నిలవటమే మా లక్ష్యం” అని తెలిపారు.జీ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ రాఘవేంద్ర హున్సూర్ మాట్లాడుతూ ‘‘ఈ లైనప్‌లో ఉన్న ప్రతి టైటిల్‌ను ఒక స్పష్టమైన ఉద్దేశంతోనే ఎంపిక చేశాం.
మా దృష్టిలో గొప్ప కంటెంట్ అంటే ఎక్కువ సంఖ్యలో ఉండటం కాదు, ప్రేక్షకులతోబలంగా కనెక్ట్ అయ్యే కథలను ముందుకు తీసుకురావటమే. ఈరోజుల్లో భారతీయ ప్రేక్షకులు భాష, జోనర్, ఫార్మెట్స్‌ను చూడకుండా వైవిధ్యమైన కంటెంట్‌ను చూడటానికి ఇష్టపడుతున్నారు. ఆ మార్పును దృష్టిలో పెట్టుకుని మా కంటెంట్ స్ట్రాటజీ రూపొందించబడింది. మేం సృష్టించే, ఎంపిక చేసే ప్రతి కంటెంట్‌లో ప్రేక్షకుల విభిన్న అవసరాలను తీర్చే కథలను ఈ లైనప్‌లో కలిపాం.
డిఫరెంట్‌గా, తమ స్వరాన్ని ధైర్యంగా వ్యక్తపరిచే, భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే శక్తి ఉన్న కథలను ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం. అదే జీ5 గుర్తింపుగా నిలవాలని మేం కోరుకుంటున్నాం” అని తెలిపారు.స్క్రిప్టెడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను దాటి జీ5 తన ఎంటర్‌టైన్‌మెంట్ ఎకోసిస్టమ్‌ను లైవ్ స్పోర్ట్స్, AI, యానిమేషన్, పిల్లల కంటెంట్‌లతో మరింతగా విస్తరిస్తోంది.
ఈ ప్లాట్‌ఫారమ్ స్పోర్ట్స్ విభాగంలో ఫిఫా, బన్‌దేస్‌లిగా, ఐఎల్‌టీ సీజన్5, తమిళనాడు కబడ్డీ వంటి గ్లోబల్ ప్రాపర్టీస్‌ను అందిస్తోంది. అలాగే AI, యానిమేషన్ విభాగంలో గార్డ్ ఏక్ యోధ కిగాథ, నర్మద మానస సుందరి, విక్రమ్ భేతాల్, శివ్ సాతి-ఏక్ అనంత్ ప్రేమ్ కహాని, పరమ్ సుందరి చంద్రకాంత, తిరుపతి బాలాజీ, రామ్ ఆంజనేయ యుద్ధ్, అయ్యప్పన్ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. పిల్లల కంటెంట్‌లో శివ్‌లోక్ కె కుండక్క మండక్క, స్మార్ట్ కిడ్స్, టేల్స్ ఆఫ్ కృష్ణ, బంద్‌బుద్ అండ్ బుద్‌బాక్ 2.0 వంటి షోలు ఉన్నాయి.
ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు సరిపోయే విధంగా విభిన్న కంటెంట్‌ను అందిస్తూ జీ5 ఒక సంపూర్ణ ఎంటర్‌టైన్‌మెంట్ డెస్టినేషన్‌గా తన స్థానాన్ని మరింత బలపరుస్తోంది.ఈ ల్యాండ్‌మార్క్ కంటెంట్ లైనప్‌తో భారతదేశంలో నిర్భయంగా చెప్పాలనుకున్న కథలకు సజీవంగా కనిపించే వేదికగా జీ5 తన స్థానం మరింత బలపరుచుకుంది. ప్రముఖ భాగస్వామ్యాలు, ఐకానిక్ ఫ్రాంచైజీలు, కొత్త ఒరిజినల్స్‌తో పాటు ఏడు భాషల్లో విభిన్న కథలను ఒకచోటికి తీసుకువచ్చింది.
విస్తృతమైన స్థాయి, భారీ ఆశయాలు, విభిన్నమైన ఎంపికలు, ధైర్యమైన స్వరంతో రూపొందిన ఈ లైనప్, ఇతరుల కంటే భిన్నమైన వినోదాన్ని అతిపెద్ద స్థాయిలో అందించాలనే జీ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది.