Scene: పాటల కౌంట్‌తో మరోసారి వైరల్‌ అవుతున్న ‘సీన్‌’.. అన్నేసి పాటలా?

ఒక సిరీస్‌లో రెండు సెంచరీలు బాది.. మూడో సెంచరీ కోసం రెడీ అవుతున్న బ్యాటర్‌లా.. ఈ ఏడాది రెండు బ్లాక్‌ బస్టర్‌లు కొట్టి మూడో హిట్ కోసం రెడీ అవుతున్నాడు ‘ది వన్‌’ సూర్య. ఆయన నుండి ఈ దీపావళికి రాబోతున్న సినిమా ‘సీన్‌’. జీతూ మాధవన్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయంలో బయటకు వచ్చింది. అదే సినిమాలో పాటల గురించి..

Scene

అదేంటి పాటలు లేవా అని అనుకోవద్దు. ఎందుకంటే ఇందులో పాటలున్నాయి. అది కూడా రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలా కాకుండా ఏకంగా 13 పాటలు ఉన్నాయి. సుశిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో ఏకంగా 13 పాటలు ఉన్నాయని దర్శకుడు జీతూ మాధవన్‌ చెప్పుకొచ్చారు. ఆ పాటల్లో సినిమా కథకు సంబంధించిన కొన్ని స్పాయిలర్స్ ఉన్నందున వాటిని థియేటర్లలో మాత్రమే చూసేలా ఇప్పుడు ప్రచారంలో రిలీజ్‌ చేయలేదట.

ఈ సినిమాలో సూర్య ఒక విచిత్రమైన, భిన్నమైన పద్ధతులు ఉన్న పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ డీఎస్పీ ఇన్బరాజ్ పాండియన్‌గా కనిపిస్తాడు. తెలుగులో పాత్ర పేరును డీఎస్పీ ప్రేమ్‌రాజ్‌ అని పెట్టారు. నేరస్థులను డీల్ చేయడంలో ప్రేమ్‌రాజ్‌ శైలి వినూత్నంగా, డార్క్ హ్యూమర్‌తో ఉంటుందని ప్రచార చిత్రాల్లో అర్థమవుతోంది. ఈ సినిమాలో నజ్రియా నజీమ్ హీరోయిన్‌. మలయాళ నటుడు నస్లేన్ ఓ సైకో విలన్ పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమాను సూర్య, జ్యోతిక కలసి జగరం స్టూడియోస్, 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ల మీద నిర్మించారు. ఇప్పటికే ‘కరుప్పు’, ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ సినిమాలతో ఈ ఏడాది భారీ విజయాలు అందుకున్న సూర్య.. ఈ సినిమాతోనూ విజయం సాధిస్తే ఇటీవల కాలంలో హ్యాట్రిక్‌ విజయం అందుకున్న స్టార్‌ హీరోగా నిలుస్తాడు. గతేడాది వరకు సూర్య సినిమాల విషయంలో ఆగ్రహించిన ఫ్యాన్స్‌ ఇప్పుడు ‘సీన్‌’ కోసం ఎదురుచూస్తున్నారు.

సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో ఆచితూచి నాగవంశీ అడుగులు.. ‘వార్‌ 2’ దెబ్బనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus