Naga Vamsi: సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో ఆచితూచి నాగవంశీ అడుగులు.. ‘వార్‌ 2’ దెబ్బనా?

తెలుగు సినిమా పరిశ్రమలో స్ట్రెయిట్‌ సినిమాలు నిర్మించడంలోనూ, ఇతరులు నిర్మించిన సినిమాను తీసుకొని రిలీజ్‌ నిర్మాతగా వ్యవహరించడంలో నాగవంశీకి మంచి పేరు ఉంది. అయితే అలా తీసుకున్న సినిమాల్లో కొన్ని డిజాస్టర్‌ అయి మొత్తంగా దెబ్బేస్తుంటాయి. అలాంటి వాటిలో ‘వార్‌ 2’ గురించి చెప్పాలి. ‘దేవర’ సినిమాకు కూడా పెట్టిన డబ్బులు రాలేదంటారు, వచ్చాయంటారు అనుకోండి. ఆ సినిమా ఏమో కానీ.. ‘వార్‌ 2’ అయితే మామూలు దెబ్బ కొట్టలేదు.

Naga Vamsi

‘వార్‌ 2’ సినిమా ఎఫెక్టో, లేక ఇప్పుడు ముందుకొచ్చి వెనక్కి వెళ్లిన సినిమాల సంగతి తెలిసిందో కానీ.. ఇప్పుడు ఓ పెద్ద సినిమాను వదిలేసుకున్నారు అని చెబుతున్నారు. రీసెంట్‌గా ‘జైలర్‌ 2’ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేసి రీసెంట్‌ లాస్‌లను ఈ సినిమా లాభాలతో బాగానే కవర్‌ చేసుకున్నారు నాగవంశీ. ఈ క్రమంలో ఆయన వదులుకున్న రెండు పెద్ద సినిమాల విషయం బయటకు వచ్చింది. అవే ‘ప్యారడైజ్‌’, ‘వృషకర్మ’. అవును ఈ రెండు సినిమాలు తొలుత నాగవంశీవే.

నాని – శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో రూపొందిన ‘ప్యారడైజ్‌’ సినిమా మీద తొలుత మంచి అంచనాలు ఉండటంతో ఎక్కువ మొత్తం డబ్బులు పెట్టి రైట్స్‌ కోసం సిద్ధమయ్యారు. అయితే ఇంటర్నల్‌ సమాచారం మేరకు ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్‌లో వాటాను బాగా తగ్గించేశారట. కొన్ని ఏరియాలు బయటవారికి ఇచ్చేశారట. దీంతో ‘ప్యారడైజ్‌’ సినిమా దెబ్బ నాగవంశీకి పెద్దగా ఇబ్బంది పెట్టలేదట.

ఇప్పుడు నాగచైతన్య ‘వృషకర్మ’ సినిమాను కూడా ఇదే కారణం చేత వదులుకున్నారు అని చెబుతున్నారు. దీంతో దిల్‌ రాజు ఈ డీల్‌లో ముందుకొచ్చారట. అయితే ఆయన ఎక్కువ ఇవ్వడం వల్ల నిర్మాతలు అటు వెళ్లారు అనే చర్చ కూడా నడుస్తోంది. ఈ విషయం తేలాలి అంటే డిసెంబరు 4న రావాల్సిందే. ఆ రోజు ‘వృషకర్మ’ తవ్వకాలు జరపాల్సిందే. ఆ తవ్వకాల్లో ఎలాంటి ఫలితం వస్తుందో చూసి.. ఇప్పుడు నాగవంశీ వేసిన స్టెప్‌ కరెక్టా కాదా అనేది తేల్చొచ్చు.

ఫైనల్‌గా మారిపోయిన ఆర్‌.నారాయణమూర్తి.. ఈ సినిమాలో అంత స్పెషలేంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus