Akkineni Heroes: ఆ సినిమాల ఫలితాలే అక్కినేని హీరోల కెరీర్ ను డిసైడ్ చేస్తాయా?

  • February 6, 2023 / 06:42 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కుటుంబాలలో అక్కినేని ఫ్యామిలీ ఒకటి. అక్కినేని నాగార్జున, అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తుండటం గమనార్హం. నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ అనే సినిమాలో నటిస్తుండగా అఖిల్ ఏజెంట్ సినిమాలో నటిస్తున్నారు. నాగార్జున ప్రసన్న కుమార్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండటం గమనార్హం. నాగ్ ప్రసన్న కుమార్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని కొంతకాలం క్రితం కామెంట్లు వినిపించాయి.

అయితే ఈ ప్రాజెక్టులే అక్కినేని హీరోల కెరీర్ ను డిసైడ్ చేయనున్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అక్కినేని హీరోల సినిమాలు భారీ బడ్జెట్లతోనే తెరకెక్కుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అక్కినేని హీరోల సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. అక్కినేని హీరోల గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదు. సినిమాలు హిట్టైనా ఆ సినిమాలు ఇండస్ట్రీ హిట్ కావడం లేదని అభిమానులు తెగ ఫీలవుతున్నారు.

అక్కినేని హీరోలు కలిసి నటించిన సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అక్కినేని హీరోలు కథల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. అక్కినేని హీరోల రెమ్యునరేషన్లు ప్రస్తుతం పరిమితంగానే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున ఈ మధ్య కాలంలో బంగార్రాజు మినహా మరే సినిమాతో సక్సెస్ సాధించలేదు. నాగ్ మార్కెట్ సినిమా సినిమాకు తగ్గుతుండటం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోంది.

మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా అక్కినేని హీరోలు కథలను ఎంచుకోవాల్సి ఉంది. అక్కినేని హీరోలు ఈ ఏడాది సక్సెస్ ట్రాక్ లోకి కచ్చితంగా వస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అక్కినేని హీరోలు స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus