Michael Review: మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • February 3, 2023 / 04:21 PM IST

Cast & Crew

  • సందీప్ కిషన్ (Hero)
  • దివ్యాంశ కౌశిక్ (Heroine)
  • జయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరుణ్ సందేశ్, అయ్యప్ప శర్మ, వరలక్ష్మి శరత్‌కుమార్ మరియు అనసూయ (Cast)
  • రంజిత్ జయకోడి (Director)
  • భరత్ చౌదరి & పుస్కుర్ రామ్ మోహన్ రావు (Producer)
  • సామ్ సిఎస్ (Music)
  • కిరణ్ కౌశిక్ (Cinematography)
  • Release Date : ఫిబ్రవరి 3, 2023

యంగ్ హీరో సందీప్ కిషన్ ఇటీవల నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సోసోగానే పెర్ఫార్మ్ చేస్తున్నాయి. మౌత్ టాక్ బాగా వస్తున్నా.. హిట్టు అనే పదానికి అడుగు దూరంలోనే ఆగిపోతున్నాయి అతని సినిమాల బాక్సాఫీస్ ఫలితాలు. అయితే ‘మైఖేల్’ అనే చిత్రంతో మరోసారి అతను తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా టీజర్,ట్రైలర్లు బాగానే ఉన్నాయి. సో సినిమా పై కొంతవరకు అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ మూవీ అందుకుందో లేదో చూద్దాం రండి :

కథ : జైలులో పుట్టిపెరిగిన మైఖేల్(సందీప్ కిషన్) తన తండ్రి పై పగ తీర్చుకోవడానికి ముంబైలో అడుగుపెడతాడు. ఈ క్రమంలో ముంబై మాఫియా సామ్రాజ్యానికి తిరుగులేని డాన్ గా చలామణి అవుతున్న గురునాథ్ (గౌతమ్ మీనన్) ను ఓ భారీ ఎటాక్ నుండి మైఖేల్ కాపాడతాడు. అలా గురునాథ్ కి దగ్గరవుతాడు మైఖేల్. అయితే తనపై ఎటాక్ చేసిన వారిలో రతన్ (అనీష్ కురువిల్లా) ను తప్ప మిగిలిన వాలందరినీ హతమారుస్తాడు గురునాథ్. ఈ క్రమంలో రతన్ ను చంపే బాధ్యతను మైఖేల్ చేతిలో పెడతాడు గురునాథ్.

రతన్‌ ను గాలిస్తున్నక్రమంలో అతని కుమార్తె తీర (దివ్యాంశ కౌశిక్)కు దగ్గరవుతాడు మైఖేల్. ఆమెతో ప్రేమలో పడతాడు. రతన్ ను చంపే ఛాన్స్ వచ్చిన చంపలేడు. ఈ విషయం గురునాథ్ కు తెలుస్తుంది? తర్వాత ఏం జరిగింది. మైఖేల్ జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. గురునాథ్ కుమారుడు అమర్ నాథ్ (వరుణ్ సందేశ్),అతని భార్య (అనసూయ) మైఖేల్ ను చంపాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు : సందీప్ కిషన్ ప్రతి సినిమాకి చాలా కష్టపడతాడు. ముఖ్యంగా తన లుక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. మైఖేల్ కు అంతకు మించి అన్నట్టు పనిచేశాడు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో సందీప్ చాలా శ్రద్ధ పెట్టి పనిచేసినట్టు స్పష్టమవుతుంది. అయితే సందీప్ తో ఓ ప్రాబ్లమ్ ఉంటుంది. అతను సీరియస్ గా నటించాల్సిన టైంలో ప్రభాస్, పవన్ కళ్యాణ్ లను ఇమిటేట్ చేస్తున్నట్లు ఉంటుంది.

ఇందులో కూడా అది రిపీట్ అయ్యింది. సందీప్ మాస్ ఆడియన్స్ కు దగ్గరవడానికి ఇంకా ఏదో తక్కువవుతుంది. అది ‘మైఖేల్’ ద్వారా మరోసారి రుజువైంది. అయితే యాక్షన్ ఎపిసోడ్స్ అతని కటౌట్ కు తగ్గట్టు ఉండడంతో ఆ రకంగా మెప్పించగలిగాడు. హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ పర్వాలేదు అనిపిస్తుంది. మాఫియా డాన్ పాత్రలో గౌతమ్ మీనన్ ఓకే అనిపించదు.

‘మైఖేల్’తో వరుణ్ సందేశ్ రీ ఎంట్రీ ఎంత వరకు వర్కౌట్ అయ్యిందో అంచనా వేయడం కష్టంగా మారింది. అనసూయ క్యారెక్టర్ సినిమాలో ఉన్న ఓ సర్ప్రైజింగ్ ఎలిమెంట్. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ తమకు అలవాటైన పాత్రల్లో బాగానే చేశారు. మిగిలిన వాళ్ళు తమ పాత్రలకు తగ్గట్లు నటించారు.





సాంకేతిక నిపుణుల పనితీరు : ‘మైఖేల్’ కథ పరంగా కొత్తదేమీ కాదు. పవన్ కళ్యాణ్ చేసిన ‘బాలు’ ‘పంజా’, ప్రభాస్ ‘మున్నా’ చిత్రాలకు సిమిలర్ గా ఉండే కథ ఇది. రంజిత్ జయకోడి ‘మైఖేల్’ ను తమిళ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా తీసి తెలుగు ప్రేక్షకులను కూడా యాక్సెప్ట్ చేయండి అన్నట్టు ఉంది. అయితే టెక్నికల్ గా మైఖేల్ పాస్ మార్కులు వేయించుకుంటుంది. కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ బాగుంది.సామ్ సి ఎస్ నేపధ్య సంగీతం బాగుంది.

కానీ పాటలు తొందరగా ఎక్కవు. ‘కె.జి.ఎఫ్'(సిరీస్) ‘విక్రమ్’ ల ఛాయలు ఈ సినిమాలో చాలా వరకు కనిపిస్తాయి. నిడివి 2 గంటల 35 నిమిషాలు ఉంది. అయితే ఈజీగా ఇంకో పావుగంట లేపేయొచ్చు. ఈ విషయంలో ఎడిటింగ్ లోపం ఏంటనేది క్లియర్ గా బయటపడింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎంతైనా ఖర్చు పెట్టే నిర్మాతలు ఉన్నప్పుడు..

మంచి యాక్షన్ ఎలిమెంట్స్ తో సినిమా తీయగల దర్శకుడు కాస్త కొత్త కథ ఎంచుకుని ఉంటే బాగుండేది.ఇప్పుడైతే రొటీన్ గ్యాంగ్స్టర్ ఫిలిం అనే ఫీలింగ్ కలిగించింది.





విశ్లేషణ : మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇష్టపడేవాళ్లు ఈ వీకెండ్ కు ఒకసారి ట్రై చేయొచ్చు. లేదంటే ఓటీటీల్లో చూసుకోవడం బెటర్.




రేటింగ్ : 1.5/5

Click Here To Read in ENGLISH

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus