2024 సంవత్సరంలో బాక్సాఫీస్ షేక్ చేసే సినిమాల జాబితా ఇదే!

  • November 10, 2023 / 08:55 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ ఊహించని స్థాయిలో పెరిగింది. టాలీవుడ్ హీరోలు భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తుండగా ఈ సినిమాల కోసం ఇతర భాషల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓవర్సీస్ లో టాలీవుడ్ సినిమాలు కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తున్నాయి. 2024లో బాక్సాఫీస్ షేకవ్వాల్సిందే అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. 2024లో చాలా క్రేజీ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. 2024 సంవత్సరంలో బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమాల జాబితాలో రిలీజ్ డేట్ ప్రకారం గుంటూరు కారం ముందువరసలో ఉంది.

జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సమ్మర్ కానుకగా రిలీజ్ కానున్న దేవర మూవీ కూడా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. 2024లో ప్రభాస్ ప్రాజెక్ట్ కే, సలార్2 సినిమాలు సైతం థియేటర్లలో రిలీజ్ కానున్నాయి . ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ చరిత్రను మార్చే సినిమాలు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పవన్ ఓజీ, చరణ్ గేమ్ ఛేంజర్, బన్నీ పుష్ప2 (Pushpa2) కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమాల జాబితాలో ఉన్నాయి.

పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా రికార్డులను బ్రేక్ చేసే సినిమా అవుతుందని మరి కొందరు ఫీలవుతున్నారు. ఈ సినిమాలలో నాలుగు సినిమాలు హిట్టైనా వేల కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 2024లో మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లు కూడా రిలీజ్ కానుండగా ఆ ప్రాజెక్ట్ లు ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తాయో చూడాల్సి ఉంది.

2024 సంవత్సరంలో టాలీవుడ్ కు చెందిన చాలామంది హీరోల కెరీర్ కు కీలకం కానుందని ప్రచారం జరుగుతోంది. 2024 సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీకి మెమరబుల్ ఇయర్ గా నిలుస్తుందేమో చూడాలి. టాలీవుడ్ నుంచి రాబోయే రోజుల్లో అత్యంత భారీ బడ్జెట్ తో మరిన్ని సినిమాలు వస్తాయేమో చూడాల్సి ఉంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus