Keedaa Cola Review in Telugu: కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • తరుణ్ భాస్కర్ దాస్యం, చైతన్య రావు (Hero)
  • N/A (Heroine)
  • జీవన్ కుమార్, బ్రహ్మానందం, రాగ్ మయూర్, రవీంద్ర విజయ్ తదితరులు.. (Cast)
  • తరుణ్ భాస్కర్ దాస్యం (Director)
  • కె.వివేక్ సుధాంషు - సాయికృష్ణ గద్వాల్ - శ్రీనివాస్ కౌశిక్ నండూరి - శ్రీపాడ్ నందిరాజ్ - ఉపేంద్ర వర్మ (Producer)
  • వివేక్ సాగర్ (Music)
  • ఏజే.ఆరోన్ (Cinematography)
  • Release Date : నవంబర్ 04, 2023

“ఈ నగరానికి ఏమైంది” లాంటి కల్ట్ కామెడీ అనంతరం కొంత విరామం తీసుకొని.. తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన తాజా చిత్రం “కీడా కోలా”. క్రైమ్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రం మేకింగ్ టైమ్ నుంచి ట్రెండ్ అవుతూ వచ్చింది. ఈ క్రైమ్ కామెడీకి బ్రహ్మానందం తొడవ్వగానే మరింత ఆసక్తి పెరిగింది. నవతరం ఆర్టిస్టులు & టెక్నీషియన్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం మీద విశేషమైన అంచనాలున్నాయి. తరుణ్ భాస్కర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో యువత ఈ సినిమాపై భీభత్సమైన అంచనాలు పెట్టుకొన్నారు. దీనికి వివేక్ సాగర్ పాటలు తొడయ్యాయి. మరి తరుణ్-వివేక్ కాంబినేషన్ ఈసారి ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగారా? లేదా? అనేది చూద్దాం..!!

కథ: తాతయ్య వరదరాజులు (బ్రహ్మానందం) అడిగాడు కదా అని కూల్ డ్రింక్ కొనుక్కొని ఇంటికొస్తాడు మనవడు వాస్తు (చైతన్య రావు) & అతడి ఫ్రెండ్ కౌశిక్ అలియాస్ లంచం (రాగ్ మయూర్). కట్ చేస్తే.. ఆ కీడా కోలా బాటిల్ లో నిజంగానే కీడా (బొద్దింక) ఉంటుంది. దొరికిందే ఛాన్స్ అని లాయర్ అయిన లంచం లీగల్ కేస్ వేసి కోట్లు కొట్టేద్దామనుకుంటాడు. మళ్ళీ కట్ చేస్తే.. కథలోకి ఎంటర్ అవుతారు నాయుడు (తరుణ్ భాస్కర్) & జీవన్ (జీవన్ కుమార్). వీళ్ళ ఎంట్రీతో కథా గమనం మొత్తం మారిపోతుంది.

ఇంతకీ కీడా కోలా కూల్ డ్రింక్ టీం వీళ్ళకి డబ్బులు ఇచ్చారా? ఆ డబ్బులు తీసుకోవడానికి ఎంత ఇబ్బందిపడ్డారు? వాళ్ళు ఎదుర్కొన్న అవరోధాలు ఏమిటి? అనేది “కీడా కోలా” కథాంశం.

నటీనటుల పనితీరు: సినిమాలో క్యాస్టింగ్ వైజ్ ఎలాంటి ప్రియారిటీ లేదు కానీ.. ఉన్నవాళ్ళలో అందరికంటే ఎక్కువ స్క్రీన్ ప్రెజన్స్ & స్క్రీన్ టైమ్ ఉన్న క్యారెక్టర్ మాత్రం జీవన్ ది. మొండోడిగా జీవన్ నటన & చిన్నపాటి విలనిజం బాగా వర్కవుటయ్యాయి. నాయుడుగా తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో పూర్తిస్థాయి నటుడిగా ఆకట్టుకున్నాడు. నత్తి లాంటి వ్యాధితో బాధపడే యువకుడిగా చైతన్య రావు, లాయర్ గా రాగ్ మయూర్, కంపెనీ ఓనర్ గా రవీంద్రలు అలరించారు. షాట్స్ పాత్రలో రఘురాం బాగా నవ్వించాడు.

సీనియర్ నటులు బ్రహ్మానందంను ఒకట్రెండు సీన్స్ మినహా సరిగా వినియోగించుకోలేదు. ఎమోషనల్ సీన్ లో మాత్రం తన సీనియారిటీ నిరూపించుకున్నారు బ్రహ్మీ.

సాంకేతికవర్గం పనితీరు: వివేక్ సాగర్ సంగీతం గురించి ముందుగా చెప్పుకోవాలి. సినిమా థీమ్ కి తగ్గట్లు హట్కే మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు. పాటలకి పెద్దగా స్కోప్ లేని ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ తో కథా గమనానికి కేంద్రబిందువుగా నిలిచాడు వివేక్ సాగర్. అతడి మాస్ బీజీయమ్స్ సినిమాను, సినిమాలోని ఎమోషన్స్ ను అద్భుతంగా ఎలివేట్ చేశాయి. ఆరోన్ సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి మరో ఎస్సెట్ గా నిలిచింది. ముఖ్యంగా షూటింగ్ సీక్వెన్స్ ను తెరకెక్కించిన విధానం అబ్బురపరుస్తుంది. ఇక కోలాలో కీడా కలిపే సీక్వెన్స్ లను హాలీవుడ్ స్టైల్లో తెరకెక్కించిన విధానం నవతరం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ బాగున్నాయి.

ఇక దర్శకుడు తరుణ్ భాస్కర్ విషయానికి వస్తే.. ఈ సినిమాతో డైరెక్టర్ గా కంటే యాక్టర్ గా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు. టెక్నికల్ గా సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించినప్పటికీ.. కథకుడిగా & దర్శకుడిగా మాత్రం అతడిలోని పూర్తిస్థాయి ప్రతిభ ఈ చిత్రంలో కనబడలేదనే చెప్పాలి. కొన్ని పంచ్ డైలాగులు & కామెడీ సీక్వెన్స్ లతో మాత్రం విపరీతంగా ఆకట్టుకున్నాడు . కానీ ఓవరాల్ గా మాత్రం బొటాబోటి మార్కులతో సరిపెట్టుకున్నాడు. తదుపరి చిత్రం విషయంలోనైనా టెక్నికల్ అంశాలతోపాటు సినిమాకి చాలా కీలకమైన కతకథనాలపై దృష్టి సారిస్తాడని కోరుకుందాం.

విశ్లేషణ: ఎలాంటి అంచనాలు లేకుండా.. ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరు కలిసి వెళ్తే థియేటర్లో మస్తుగా ఎంజాట్ చేసే సినిమా “కీడా కోలా”. టెక్నికల్ గా రిపీట్స్ లో చూడదగ్గ అంశాలు పుష్కలంగా ఉన్న ఈ చిత్రం కథ-కథనం విషయంలో తరుణ్ భాస్కర్ ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే మరో కల్ట్ కామెడీ సినిమాగా చరిత్రలో నిలిచిపోయేది.

రేటింగ్: 2.5/5

Click Here To Read in ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus