Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Advertisement

2017లో వచ్చిన “మహానుభావుడు” తర్వాత శర్వానంద్ కి హీరోగా కమర్షియల్ హిట్ అందుకోవడానికి ఏకంగా ఆరేళ్లు పట్టింది. “నారీ నారీ నడుమ మురారి”తో మళ్లీ ఊపిరి పీల్చుకున్నాడు శర్వా (Sharwanand). అయితే.. తాను కామ్ బ్యాక్ ఇచ్చిన ఏడాదిలోనే మరో రెండు హిట్లు కొట్టేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఆల్రెడీ “బైకర్” చిత్రం ఏప్రిల్ 3న రిలీజ్ కి రెడీగా ఉండగా, ఇవాళ “భోగి” రిలీజ్ డేట్ ని ఆగస్ట్ 28కి ఫిక్స్ చేసి అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

Sharwanand

ఇదివరకు శర్వానంద్ తన కెరీర్ స్టార్టింగ్ లో 2006లో “లక్ష్మి, అమ్మ చెప్పింది, వీధి” లాంటి సినిమాలతో ఒకసారి పలకరించాడు, పూర్తిస్థాయి హీరోగా మారాక “శతమానం భవతి, రాధ, మహానుభావుడు” సినిమాలు 2017లో విడుదలయ్యాయి. ఇప్పుడు మూడోసారి 2026లో “నారీ నారీ నడుమ మురారి, బైకర్, భోగి” సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు.

అయితే.. ఇప్పటివరకు శర్వానంద్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న సందర్భాలు లేవు. కాకపోతే.. “బైకర్” మీద చాలా పాజిటివ్ బజ్ ఉంది, అలాగే “భోగి” సినిమాతో తన మార్కెట్ పరిధి పెరుగుతుంది అని శర్వానంద్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే గనుక.. ఒకే ఏడాది మూడు హిట్లు అందుకున్న ఏకైక యువ హీరోగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడు శర్వానంద్. గత ఏడాది “LIK” పోస్ట్ పోన్ అవ్వడంతో ఆ రికార్డ్ ని ప్రదీప్ రంగనాథ్ మిస్ అయ్యాడు.

ఇకపోతే.. శర్వానంద్ 2027లోనూ రెండు సినిమాలతో సిద్ధంగా ఉన్నాడు. శ్రీనువైట్ల సినిమాతో 2027 సంక్రాంతికి వస్తున్నట్లు ఆల్రెడీ ప్రకటించగా, మరో రెండు సినిమాలు సైన్ చేశాడు శర్వా. మరి శర్వానంద్ సక్సెస్ స్ట్రిక్ ఏమేరకు కంటిన్యూ అవుతుందో చూడాలి.

పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus