Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

నిన్న విడుదలైన “బ్యాండ్ మేళం” టీజర్ కి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు యావరేజ్ గా ఉంది అంటే, ఇంకొందరు కామెడీ వర్కవుట్ అవ్వలేదు అన్నారు. అయితే.. హర్ష్ రోషన్ & శ్రీదేవి కాంబినేషన్ మాత్రం బాగుందనే చెప్పాలి. సతీష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం టీజర్ లో “పోక్సో యాక్ట్” గురించి వేసిన కామెడీ పంచ్ మాత్రం అవసరమా అనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే సమాజం కానీ, ప్రభుత్వం కానీ ఆ యాక్ట్ ని సీరియస్ గా తీసుకోవడం స్టార్ట్ చేశాయి.

Kona Venkat

అలాంటి ఒక సెన్సిటివ్ యాక్ట్ మీద ఇలా కామెడీ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కోన & టీమ్ కే తెలియాలి. హర్ష్ రోషన్ & శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా “కోర్ట్” మూలమే ఈ పోక్సో యాక్ట్. దాన్ని కొందరు ఎలా మిస్ యుటిలైజ్ చేస్తున్నారు అనేది ఆ సినిమాతో చెప్పడమే కాక, ఆ యాక్ట్ ఎంత ఇంపార్టెంట్ అనేది వివరించారు.

ఇప్పుడు అదే కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఆ యాక్ట్ గురించి కామెడీ చేయడం అనేది ఎందుకో మింగుడుపడలేదు. సినిమా బిజినెస్ లేదా మార్కెటింగ్ కి ఆ డైలాగ్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో తెలియదు కానీ.. మోరల్ గా మాత్రం అది కరెక్ట్ కాదు. అయితే.. ఇంకా టీజర్ కి ఇంకా సెన్సార్ అవ్వలేదు కాబట్టి, భవిష్యత్తులో సెన్సార్ బోర్డ్ ఆ డైలాగ్ ను ఉంచుతుందా లేదా మ్యూట్ చేస్తుందా అనేది చూడాలి.

ఎందుకంటే.. రీసెంట్ గా సినిమాల టైటిల్స్ విషయంలోనే సెన్సార్ బోర్డ్ చాలా సీరియస్ గా ఉంటోంది. అలాగే.. పర్సనాలిటీ రైట్స్ వచ్చాక పాత నటీనటుల లేదా ప్రముఖులు ఫోటోలు NOC లేకుండా వినియోగించడానికి కూడా ఒప్పుకోవడం లేదు. మరి “బ్యాండ్ మేళం” సినిమా విషయంలో సెన్సార్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూద్దాం.

మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus