Shah Rukh Khan: స్టార్‌ హీరో ఇంటి ముందు ఫ్యాన్స్‌ సందడి… మొబైల్స్‌ కొట్టేశారట!

  • November 5, 2023 / 10:29 PM IST

బాలీవుడ్‌లో హీరోల ఇంటి ముందు అభిమానులు గంటల తరబడి వేచి ఉండటం మనం చూశాం. షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌… ఇలా కొంతమంది హీరోల ఇంటి ముందు అభిమానులు ఇలా వెయిట్‌ చేస్తూ ఉంటారు. అలా ఇటీవల షారుఖ్‌ ఖాన్‌ ఇంటి ముందు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో మొబైల్స్‌ కొన్ని మిస్‌ అయ్యాయట. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 మొబైల్స్‌ మిస్‌ అయ్యాయట.

షారుఖ్‌ ఖాన్‌ సినిమా విడుదలవుతోంది అంటే అతని ఫ్యాన్స్‌లో పండగ వాతావరణం నెలకొంటుంది. ఆ మాటకొస్తే ప్రతి హీరో విషయంలో ఇలానే ఉంటుంది. ఇక పుట్టన రోజులు సమయంలోనూ ఇదే పరిస్థితి. అలాగే షారుఖ్‌ తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటూ ఉంటాడు. ఇటీవల పుట్టినరోజు వేడుకలు ముంబయిలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఫ్యాన్స్‌ కూడా షాక్‌ అవుతున్నారు.

ముంబయిలో షారుఖ్‌ ఖాన్‌  (Shah Rukh Khan) నివాసం ‘మన్నత్‌’ పుట్టినరోజు నాడు అతనని చూడడం కోసం వేలాదిమంది అభిమానులు వచ్చారు. ఆ సమయంలో దొంగలు వారి చేతులకు పని చెప్పారట. ఏకంగా 30కు పైగా ఫోన్‌లను కొట్టేశారట. ఇన్ని సెల్‌ఫోన్లు పోవడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. బాంద్రా పోలీస్‌ స్టేషన్‌లో ఈ మేరకు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

మరోవైపు అభిమానులను ఉద్దేశించి షారుఖ్‌ కృతజ్ఞతలు తెలిపాడు. ‘‘ఇంత రాత్రి నన్ను చూడటానికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మీకు వినోదాన్ని పంచడానికి మించిన సంతోషం మరొకటి లేదు’’ అని చెప్పాడు. ఇక షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘డంకీ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబరు 21న విడుదలవుతోంది. ఇక ఈ సినిమాలో కథానాయికగా తాప్సి నటించింది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus