Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Advertisement

‘పెద్ది’ సినిమా గ్లింప్స్‌ వచ్చినప్పుడు ఈ సినిమాలో క్రికెట్‌ మాత్రమే ఉంటుంది అని తెలిసింది. ఇక టీజర్‌ వచ్చినప్పుడు సినిమాలో రెండు ఆటలు ఉన్నాయి అని తేలింది. ఇక సినిమా ట్రైలర్‌ వచ్చాక ఈ సినిమాలో మూడు ఆటలు ఉన్నాయి అని చెప్పారు. ఆ విషయాన్ని ఇంకా ఈజీగా అర్థం కావడానికి క్రాస్‌ఓవర్‌ అథ్లెట్‌ అనే పదాన్ని కూడా ట్రైలర్‌లో చెప్పారు. అయితే ఈ సినిమాలో ఈ మూడు ఆటలే కాదు.. మరో ఆట కూడా ఉంది అనే డౌటనుమానం వచ్చింది.

Peddi

ఇప్పుడు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన బొమన్‌ ఇరానీ ఈ విషయంలో లీక్ ఇచ్చారు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొంది జూన్‌ 4న రానున్న ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ మూడు గేమ్స్‌ మాత్రమే కాకుండా నాలుగో ఆట కూడా ఆడతాడని బొమన్‌ ఇరానీ తాజాగా చెప్పారు. ఇప్పటికే ట్రైలర్‌లో కుస్తీ, క్రికెట్‌, రన్నింగ్‌ చూశాం. నాలుగో ఆడతారు అని బొమన్‌ ఇరానీ చెప్పారు. అదే డ్యాన్స్‌ అని అన్నారు బొమన్‌. చరణ్‌ తన డ్యాన్స్‌తో అదరగొట్టాడని ఇరానీ మెచ్చుకున్నారు. ఆ లెక్కన డ్యాన్సే నాలుగో ఆట అని అన్నారు.

కానీ సినిమా సన్నిహిత బృందం మాటలు చూస్తుంటే నాలుగో ఆట కచ్చితంగా ఉంది అని చెబుతున్నారు. అది పారాలింపిక్స్‌లో రన్నింగ్‌ అని చెబుతున్నారు. సినిమా క్లైమాక్స్‌లో ఊహించని పరిస్థితిలో ఒక కాలు కోల్పోయి ‘పెద్ది’ పారాలింపిక్స్‌లో రన్నింగ్‌ చేసి గెలిచి.. తన ఊరికి మంచి పేరు తీసుకొస్తాడు అని అంటున్నారు. మరి ఈ మాటలు నిజం అవుతాయా ఆ నాలుగో అట ఇదే అవుతుందా అనేది జూన్‌ 4న తేలుతుంది.

ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను జూన్‌ 1న ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించనున్నారు. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియం ఈ ఈవెంట్‌కు వేదిక కానుంది. ఇప్పటికే ఈ సినిమా టీమ్‌ భోపాల్‌, బెంగళూరు, దిల్లీ, చెన్నైలో ప్రమోషన్స్‌ చేసింది. జూన్‌2న లేదా 3న హైదరాబాద్‌లో మరో ప్రెస్‌ మీట్‌ ఉంటుందని టాక్‌

సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus