Salaar: అలా జరిగితే ప్రభాస్ నంబర్ వన్ గా నిలవడం ఖాయమేనా?

  • November 2, 2023 / 09:07 PM IST

ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ భారీ బడ్జెట్ కాంబినేషన్ కాగా సలార్ సినిమా రిలీజ్ కావడానికి మరో 50 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని సమాచారం అందుతోంది. ఈ సినిమాతో ప్రభాస్ చరిత్రను తిరగరాయడంతో పాటు 3000 కోట్ల రూపాయల కలెక్షన్లను సులువుగా సాధిస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తే మాత్రం ప్రభాస్ నంబర్ వన్ గా నిలవడం ఖాయమేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ రేంజ్, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ అని ప్రభాస్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ప్రభాస్ దూకుడుకు బ్రేకులు వేయడం సాధ్యం కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ లతో తెరకెక్కుతున్న సినిమాలు కావడం గమనార్హం.

సలార్ (Salaar) సినిమా కాన్సెప్ట్ న భూతో న భవిష్యత్ అనేలా ఉందని తెలుస్తోంది. ఈ సినిమా గురించి కొన్ని నెగిటివ్ కథనాలు ప్రచారంలోకి వస్తున్నా ప్రభాస్ సినిమా ట్రైలర్ రిలీజైతే ఈ అభిప్రాయం పూర్తిస్థాయిలో మారిపోనుంది. సలార్ సినిమాతో మరో మెట్టు పైకి ఎక్కబోతున్నానని జగపతిబాబు సైతం చెబుతున్నారు. సలార్1 కోసం జగపతిబాబు 5 రోజుల పాటు పని చేశారని సమాచారం.

సలార్ ట్రైలర్ ఈ నెలలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. సలార్ సినిమా బడ్జెట్ తో పోల్చి చూస్తే మేకర్స్ కు రెండు రెట్ల స్థాయిలో లాభాలను అందిస్తోంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus