‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

రెండు భాగాలుగా సినిమాలు రావడం అనేది మొదట హాలీవుడ్లో మొదలైంది. అటు తర్వాత బాలీవుడ్లో రెండు పార్టులు అని కాదు కానీ సీక్వెల్స్ అనే కొత్త ట్రెండ్ ను మొదలుపెట్టారు. అదే ట్రెండ్ ను టాలీవుడ్ కి తీసుకొచ్చే ప్రయత్నం చేయగా.. అది వర్కౌట్ కాలేదు. అయితే ‘బాహుబలి ‘ తో ఆ నెగిటివ్ సెంటిమెంట్ కి బ్రేక్ పడింది. ఆ సినిమా రెండు భాగాలుగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది. తెలుగు సినిమా స్టామినాని పెంచిన ఘనత ఆ సినిమాకే చెల్లింది. తర్వాత ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ వంటి చిత్రాలు రెండు భాగాలుగా వచ్చాయి కానీ అవి సక్సెస్ కాలేదు.అయితే ఆ తర్వాత ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2 ‘ ‘పొన్నియన్ సెల్వన్ 2 ‘ చిత్రాలు రెండు భాగాలుగా వచ్చి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు కూడా పలు క్రేజీ సినిమాలకు సీక్వెల్స్ రెడీ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) పుష్ప :

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో మూడో సినిమాగా రూపొందింది ఈ సినిమా. మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. రెండో భాగం ‘పుష్ప ది రూల్’ గా 2024 ఆగస్టు 15న విడుదల కాబోతుంది.

2) అఖండ :

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఇది. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అయ్యింది. రెండో పార్ట్ కూడా ఉండబోతుంది అని మేకర్స్ ప్రకటించారు. ఇటీవల నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి కూడా ‘అఖండ 2’ ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు.

3) బ్రహ్మాస్త్ర :

మొదటి భాగం ‘బ్రహ్మాస్త్ర : శివ’ పేరుతో రిలీజ్ అయ్యింది. రెండో భాగం ‘బ్రహ్మాస్త్ర : దేవ్’ అనే పేరుతో రాబోతుంది అని అయాన్ ముఖర్జీ ఎప్పుడో వెల్లడించారు. అయితే రెండో భాగం 2025 వరకు వచ్చే అవకాశం లేదు.

4) సలార్ :

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం మొదటి భాగం ‘సలార్ : సీజ్ ఫైర్’ పేరుతో రిలీజ్ కాబోతుంది. రెండో భాగం ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

5) దేవర :

ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రాబోతున్న మూవీ ఇది. ‘దేవర’ కూడా పెద్ద కథ అని.. అందుకే రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్టు ఇటీవల కొరటాల శివ చెప్పుకొచ్చారు.

6) బింబిసార :

కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో వచ్చిన ‘బింబిసార’ సూపర్ హిట్ అయ్యింది. దీనికి పార్ట్ 2 ఉంటుందని ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే సెకండ్ పార్ట్ ను వశిష్ట్ డైరెక్ట్ చేయడం లేదు అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి.

7) స్కంద :

రామ్ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన మూవీ ఇది. మొదటి పార్ట్ సూపర్ హిట్ అయ్యింది. రెండో పార్ట్ కూడా ఉంటుంది అని ఆల్రెడీ మేకర్స్ రివీల్ చేశారు. చూడాలి మరి రెండో పార్ట్ ఎప్పుడు ఉంటుందో..!

8) గూఢచారి :

అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్కా డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. దీనికి రెండో భాగం కూడా ఉంటుందని ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే రెండో పార్ట్ ను వినయ్ కుమార్ శిరిగినీడి డైరెక్ట్ చేస్తున్నాడు.

9) జైలర్ :

రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్’ సూపర్ హిట్ అయ్యింది. దీనికి రెండో భాగం కూడా ఉంటుందని ముందే ప్రకటించారు. 2024 లో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

10) విక్రమ్ :

కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దీనికి రెండో పార్ట్ ఉంటుందని దర్శకుడు లోకేష్ ఇది వరకే ప్రకటించారు.

ఇవి మాత్రమే కాదు ‘యాత్ర 2’ ‘సప్త సాగరాలు దాటి సైడ్ బి’ ‘ఘోస్ట్'(శివరాజ్ కుమార్) వంటి (Movies ) చిత్రాలకి కూడా రెండో భాగాలు రానున్నాయి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus