Bigg Boss 5 Telugu: ఆ ఇద్దరే డేంజర్ జోన్..ఈవారం ఎలిమినేషన్ లో ఉండేది ఎవరు..?

  • October 21, 2021 / 08:36 PM IST

బిగ్ బాస్ హౌస్ లో అప్పుడే ఆరువారాలు గడిచిపోయాయి. ఇందులో భాగంగా ఐదుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఎలిమినేట్ అయ్యారు. సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేత ఇలా వరుసగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. అయితే, ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఉత్కంఠని పెంచేస్తోంది. అనీమాస్టర్, లోబో, సిరి ఈ ముగ్గురు డేంజర్ జోన్ లోనే ఉన్నారు. అనీమాస్టర్ ని సేఫ్ చేయాలని అనుకుంటే లోబో ఇంకా సిరి ఇద్దరిలో ఒకర్ని ఖచ్చితంగా పంపించేస్తారు.

ఒకవేళ లోబోని ఎలిమినేట్ చేల్తే లోబో సీక్రెట్ రూమ్ కి వెళ్లినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. మరోవైపు లోబోకి గేమ్ పట్ల కూడా ఆసక్తికనిపిండం లేదు. ఇక సిరిని ఎలిమినేట్ చేస్తే మాత్రం ముగ్గురు మోజ్ రూమ్ బ్యాచ్ లో ఒకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు. అప్పుడు షణ్ముక్, జెస్సీల గేమ్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరం.

ఇక అన్ అఫీషియల్ సైట్స్ లో, వెబ్ పోలింగ్స్ లో చూస్తే మాత్రం ఖచ్చితంగా లోబోనే ఈవారం ఎలిమినేట్ అవుతాడని నెటిజన్స్ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ వీక్ నుంచీ తనదైన స్టైల్లో గేమ్ ఆడిన లోబో ఎక్కువగా రవి గేమ్ కి, అలాగే విశ్వ మాటలకి బాగా ఇన్ఫులెన్స్ అయ్యాడు. తనకంటూ ప్రత్యేకమైన గేమ్ ని డిజైన్ చేసుకోవడంలో విఫలం అయ్యాడు. ఈసారి బిగ్ బాస్ కాల్ తీస్కుంటే మాత్రం ఖచ్చితంగా లోబోని ఎలిమినేట్ చేస్తారనే అంటున్నారు బిగ్ బాస్ లవర్స్. అదీ మేటర్.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus